మంత్రి వర్గం లో అన్నమయ్య జిల్లాకు దక్కని ప్రాధాన్యత - ఊరించి ఉసూరుమనిపించిన ముఖ్యమంత్రి తీరు - భగ్గుమంటున్న నిరసనలు. రాజంపేట జిల్లా అంటూ జోరుగా ప్రచారం సాగింది.కానీ రాత్రికి రాత్రి రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లాగా ప్రకటించడం. అన్నమయ్య జిల్లాలో ఎమ్మెల్యే కొరముట్ల కు బెర్తు ఖరారనీ అనుకున్న తరుణంలో మార్పులు చేయడం పట్ల వెనకబడిన ప్రాంతాలను కలుపుకొని ఏర్పడిన అన్నమయ్య జిల్లాపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎందుకింత అసహనం అన్న వార్తలు ప్రజల్లో జోరుగా వినబడుతున్నాయి.
జిల్లా ప్రకటన కేవలం కొందరి రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసమే అనుకున్న తరుణంలో అన్నమయ్య జిల్లాలో మంత్రి పదవి లేకపోవడం మరింత చర్చనీయాంశంగా మారింది. షెడ్యూల్ వర్గానికి చెందిన కొరముట్ల శ్రీనివాసులు కు మంత్రి పదవి దక్కితే మాకేం విలువ ఉంటుంది.?? అని ఆలోచించి జిల్లాలోని కొందరు ప్రతినిధులు, నాయకుల పట్టుబట్టి వెనక్కి నెట్టరా అన్న మాటలు దావానలంలా వ్యాపిస్తూ ఉన్నాయి. సమన్యాయం సముచిత స్థానం అంటూ పలికే మాటలు.. నీటి మూట లేనా అని ముఖ్యమంత్రిని జిల్లా వాసులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఇందులో భాగం గా ఈరోజు ఉదయం పెనగలూరు మండలం బెస్తపల్లి అంబేద్కర్ విగ్రహం సర్కిల్ వద్ద నల్ల బ్యాడ్జీలతో పెనగలూరు మండలం ప్రజలు నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బూత్ కమిటీ ఇన్చార్జ్ తిప్పన నాగభూషణం, డిసిసిబి డైరెక్టర్ గంగాద్రి, మహేష్ , మనోజ్ కుమార్ రెడ్డి,చిన్నయ్య, శ్రీకాంత్ దళిత నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
Comments