ఇకపై రైళ్లో ప్రయానించాలంటే ఇవి కొనాల్సిందే
భారతీయ రైల్వే ప్రయాణికులకు అలర్ట్. దూర ప్రయాణం చేసే ప్రయాణికులు ఇకపై రైలు టికెట్లతో పాటు బెడ్‌రోల్ కిట్స్ కూడా కొనాల్సి ఉంటుంది. రైళ్లల్లో ప్రయాణికులకు డిస్పోజబుల్ బ్లాంకెట్, పిల్లో అందించనుంది రైల్వే. గతంలో రైళ్లల్లో బ్లాంకెట్స్, పిల్లోస్‌ని ప్రయాణికులకు ఇచ్చేది భారతీయ రైల్వే. కానీ కరోనా వైరస్ మహమ్మారితో వీటిని ఇవ్వడం ఆపేసింది. గతంలో రైళ్లల్లో ప్రయాణికులకు బ్లాంకెట్స్, పిల్లోస్‌ని కొన్నిరోజుల తర్వాత ఉతికి మళ్లీ ఉపయోగించేవారు. అయితే ప్రస్తుతం వైరస్ భయాలు ఉండటంతో ఒకరు ఉపయోగించిన దుప్పట్లను మరొకరు ఉపయోగించడం శ్రేయస్కరం కాదు. అందుకే వాటిని రైల్వే ఇవ్వట్లేదు.దూర ప్రయాణాలకు వెళ్లే ప్రయాణికులు, రాత్రి వేళల్లో ప్రయాణించేవారికి దుప్పటి, పిల్లో, బెడ్ షీట్ అవసరం అవుతున్నాయి. ప్రయాణికులకు కలుగుతున్న ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే డిస్పోజబుల్ బ్లాంకెట్, పిల్లో, బెడ్ షీట్ అందించాలని భావిస్తోంది. అయితే వీటికి ప్రయాణికులు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.ఈ సర్వీస్ ఉపయోగించడానికి ప్రయాణికులు రూ.150 చెల్లించాలి. ఈ ధర జోన్ల వారీగా వేర్వేరుగా ఉంటుంది. రూ.150 చెల్లించి బెడ్‌రోల్ కిట్ కొంటే అందులో 48 x 75 అంగుళాల బెడ్ షీట్, 54 x 78 అంగుళాల బ్లాంకెట్, ఎయిర్ పిల్లో, పిల్లో కవర్, ఫేస్ టవల్ లేదా న్యాప్‌కిన్, మూడు ఫేస్ మాస్కులు లభిస్తాయి. కొన్ని జోన్స్‌లో వీటితో పాటు టూత్ పేస్ట్, శానిటైజర్ కూడా ఈ కిట్‌లో లభిస్తున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ కిట్ ఉపయోగకరంగా ఉంది.
Comments