రాజారెడ్డి హత్యలో రాజకీయ ప్రమేయం లేదు - ఏఎస్పి ప్రేరణకుమార్
కడప జిల్లా, ప్రొద్దుటూరు
రాజారెడ్డి హత్య కేసులో అసత్య ప్రచారాలు, ఆరోపణలు వస్తున్నాయని, ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇలాంటి అసత్య ప్రచారాలు, పోలీసు శాఖపై ఆరోపణలు చేయటం సబబు కాదని, ఆయన వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్న పోలీసు శాఖకు సమర్పించాలని ఏఎస్పి ప్రేరణ కుమార్ ఐపిఎస్ గురువారం సాయంత్రం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. పోలీసులే పోస్ట్ మార్టం కొరకు రాజారెడ్డి మృతదేహాన్ని డాక్టర్లకు అప్పగించారని, మృతదహానికి అన్ని భాగాలలో పోస్ట్ మార్టం చేయమని చెప్పామని, మొదటి పోస్ట్ మార్టం త్వరగా జరిగినందున పోలీసులకు అనుమానం వచ్చిందని, విచారణ వేగవంతం చేసి అనుమానాలను వ్యక్తం చేసిన పోలీసులు రెండవ సారి పోస్ట్ మార్టం చేయమని ఎస్పీ ఆదేశించారన్నారు. 2వ సారి పోస్ట్ మార్టం నిర్వహించే సమయంలో ఇన్స్పెక్టర్ ఇబ్రహీం ఆధ్వర్యంలో వీడియో తీసి పోస్ట్ మార్టం నివేదిక పొందామన్నారు. డాక్టర్ వీరనాధ్ రెడ్డి కి పలుమార్లు నిందితురాలు ప్రసన్న ఫోన్ కాల్ చేసిందని, ఈ హత్య కేసులో చట్టపరమైన చర్యలు విధి విధానాలు పోలీసులు తీసుకున్నారని, అసత్య ప్రచారం చేస్తున్న ప్రవీణ్ పై చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం అని వెల్లడించారు. రాజారెడ్డి ది రాజకీయ హత్య కాదని... ఆస్తి తగాదాల వలనే హత్య జరిగిందని ధ్రువీకరించారు. రాజారెడ్డి హత్య పై తన దగ్గర ఉన్న ఆధారాలు ప్రవీణ్ పోలీసులకు సమర్పించాలని కోరారు. సమావేశంలో పట్టణ సిఐలు ఎస్సైలు పాల్గొన్నారు.
Comments