కడపజిల్లా, రాజంపేట పట్టణంలోని ఎల్లగడ్డలో వై ఎస్ ఆర్ సి పి రెబల్ అభ్యర్థి మున్సిపల్ కౌన్సిలర్ రాఘవేంద్ర రాజు కు సంబంధించిన ఇంటి స్థలం పట్టా నెంబర్ 376 గల రిజిస్టర్ భూమిలోని సమాధికి సంబంధించి ఎమ్మెల్యే అనుచరుడు ఉమా మహేశ్వర్ రెడ్డి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి, తన అధికార బలాన్ని ఉపయోగించి నిన్నటి రోజు (12.01.2022) రాత్రి 9:30 గంటల సమయంలో ఆర్.అండ్.బి అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసుల సహకారంతో సమాధిని జెసిబి తో కూల్చివేయటం జరిగింది. బాధితుల సమాచారం మేరకు వారికి ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అసలు ఏమి జరుగుతుందో చెప్పకుండా జెసిబి ని తీసుకుని వచ్చి సమాధిని కూల్చి వేశారని ఆరోపించారు. పూర్తి వివరాల్లోకి వెళితే, ఎమ్మెల్యే అనుచరుడు, బాధితుడు కడుతున్న సమాధి రోడ్డుకు అడ్డంగా ఉందని ఆర్.అండ్.బి అధికారులకు ఫిర్యాదు చేశారని, ఆ నెపంతో రాత్రి 9 గంటల సమయంలో జెసిబి తో అధికారుల సమక్షంలో బాధితుడు నానమ్మ సమాధిని కూల్చివేశారు. దీంతో ఆగ్రహం చెందిన బాధితులు, అతని మద్దతుదారులు అధికారులను అడ్డుకుని జెసిబి కి అడ్డంగా పడడంతో పోలీసులు జోక్యం చేసుకుని బాధితులను ఈడ్చి అవతల పారేశారు. బాధితులు మీడియాను ఆశ్రయించగా మీడియా రంగప్రవేశంతో అధికారులు జెసిబి తో అక్కడి నుండి వెళ్లిపోయారు. బాధితులు మీడియా ముందు వాళ్ల ఆక్రోశాన్ని వెళ్లకక్కుతూ ఎమ్మెల్యే దౌర్జన్యాలు, అనుచరుల దాష్టీకాలు మితిమీరి పోయాయి అని వాపోయారు. బాధితుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఇంతటి దౌర్జన్యానికి దిగుతున్న ఎమ్మెల్యే ఆయన అనుచరుడు ఉమా మహేశ్వర్ రెడ్డి సర్వ నాశనం అయిపోతారు అని శాపనార్థాలు పెట్టారు. కేవలం మున్సిపల్ ఎలక్షన్ లో ఎమ్మెల్యే వద్దని చెప్పినా కూడా పోటీ చేసి గెలిచిన నేపధ్యంలో కక్షపూరితంగా తన నాన్నమ్మ సమాధిని పడగొట్టారని, ఇలాంటి ఎమ్మెల్యే కి జగనన్న టికెట్ ఇస్తే రాజంపేట సర్వనాశనమై పోతుందని, జగనన్న దృష్టికి ఈ దౌర్జన్య సంఘటనను తీసుకెళ్లాలని మీడియాను కోరారు. ఎమ్మెల్యే కక్షపూరిత వైఖరి వలన తనకు ప్రాణహాని ఉందని, ఇప్పుడు కూడా మీడియా ముందు వ్యతిరేకంగా మాట్లాడినందుకు రేపు తన పైన తప్పుడు కేసులు పెట్టిస్తారని దానికి పూర్తి బాధ్యత ఎమ్మెల్యేదేనని తనకు గాని తన కుటుంబానికి గాని ఏదైనా హాని జరిగితే దానికి పూర్తి బాధ్యత ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్రెడ్డి, ఉమా మహేశ్వర్ రెడ్డి, యోగేశ్వర్ రెడ్డి ల దేనని మీడియా ముందు వాపోయారు.
పూర్తి వీడియో కోసం లింక్ పై క్లిక్ చెయ్యండి
https://youtu.be/unNnP_Uoor0
Comments