ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలి ఎం.ఈ.ఎఫ్
రాజంపేట, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని ఎం.ఈ.ఎఫ్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు పిచ్చికె బాబు మాదిగ డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎం.ఈ.ఎఫ్ జాతీయ, రాష్ట్ర కమిటీల ఆదేశాల మేరకు ఆదివారం ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఇన్చార్జి ఎం.ఈ.ఎఫ్ జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎస్.దేవానందం ఆధ్వర్యంలో సభాధ్యక్షులు జయకుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎం.ఈ.ఎఫ్ రాజంపేట మండలం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమం స్థానిక మండల విద్యాశాఖ అధికారి కార్యాలయ ఆవరణలో నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులుగా సి.ఆర్ మోహన్, అధ్యక్షులుగా పి.శంకర్, ఉపాధ్యక్షులుగా ఎన్. వెంకట సుబ్బయ్య ప్రధాన కార్యదర్శిగా కె.రమేష్ బాబు, సహాయ కార్యదర్శిగా డి.వెంకటరమణ, కోశాధికారిగా టి.చంద్రశేఖర్, గౌరవ సలహాదారులుగా నాగ సుబ్బరాయుడు తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎం.ఈ.ఎఫ్ జిల్లా అధ్యక్షులు పిచ్చికె బాబు మాదిగ మాట్లాడుతూ జనవరి 8న అనంతపురంలో జరిగే ఎం.ఈ.ఎఫ్ జాతీయ మహాసభను జయప్రదం చేయడంలో భాగంగా డిసెంబరు 10న కడపలో జరిగే ఐదు జిల్లాల ప్రాంతీయ సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే మాదిగల చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి కడప జిల్లా ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల కన్వీనర్ వెలగచర్ల శివయ్య మాదిగ, ఎం.ఈ.ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి బి.చంద్రశేఖర్, పెంచలయ్య, వెంకటేష్, శివయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments