ప్రతిఒక్కరికీ సామాజిక సేవ పట్ల స్పృహ ఉండాలి
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
ప్రతి ఒక్కరికి సమాజసేవ పట్ల అవగాహన, స్పృహ ఉండాలని ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఎల్.ఓబుళపతి పేర్కొన్నారు. అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలోని ఎన్.ఎస్.ఎస్ యూనిట్ వారి ఆధ్వర్యంలో శనివారం మండల పరిధిలోని ఊటుకూరు గ్రామంలో క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమం వారం రోజుల పాటు కొనసాగుతుందని ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ ఎల్. ఓబులపతి తెలిపారు. స్పెషల్ క్యాంపు నందు పాల్గొనే ఎన్.ఎస్ .ఎస్ వాలంటీర్లు ద్వారా విద్యార్తులకు సామాజిక సేవ పట్ల అవగాహన కల్పిస్తారని ఆయన అన్నారు. సామాజిక పరిస్థితులను తెలుసుకునేందుకు విద్యార్థులకు ఇదొక చక్కని అవకాశమని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.ఎం.వీ నారాయణ తెలియజేశారు.
స్పెషల్ క్యాంపులో భాగంగా ఊటుకూరు గ్రామానికి ఎన్ఎస్ఎస్ విద్యార్థులు వెళ్ళి సామాజిక స్థితిగతులమీద, అక్షరాస్యతమీద సర్వే జరిపి అక్షరాస్యత 63శాతం ఉందని గుర్తించారని.. ఈ వారం రోజుల క్యాంపులో పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం., వాటిపట్ల ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. స్థానిక గ్రామంలోని పాఠశాల విద్యార్థులకు వివిధ రకాల పరిజ్ఞానం, క్రీడల ప్రాముఖ్యత గురించి వివరించడం జరుగుతుందన్నారు. ఎన్ఎస్ఎస్ క్యాంపు నిర్వహించడానికి సహకరించిన కళాశాల యాజమాన్యంకు డాక్టర్ ఓబులపతి ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు.
Comments