రజినీపై సస్పెన్షన్ వేటు, పదవి తొలగింపు
వైఎస్సార్, జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు వైసిపి కార్యాలయం నందు శుక్రవారం సాయంత్రం పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ జింక విజయలక్ష్మి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత మూడు రోజులుగా పలు వివాదాస్పద వ్యాఖ్యలకు ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారిన ప్రొద్దుటూరు వైసీపీ నాయకురాలు బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ రాజపుత్ర రజిని దొంగ నోట్ల చెలామణి వ్యవహారంలో కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరం నందు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారని వస్తున్న అభియోగాల పై రాష్ట్ర వైసిపి నాయకులకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సస్పెండ్ చేయమని సిఫారసు చేయగా, కేసు నమోదైన కారణంగా పార్టీ నుండి రాజపుత్ర రజినీ ని సస్పెండ్ చేసినట్లు, బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ పదవి నుండి కూడా తొలగించినట్లు ఆమె వెల్లడించారు.
వైఎస్సార్సీపీ పార్టీ నిజాయితీ, నిబద్ధత, పారదర్శకతకు ఈ సంఘటన నిదర్శనం అని ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి మహిళా అధ్యక్షురాలు భోగాల లక్ష్మీనారాయణమ్మ డ్వాక్రా మహిళలకు మోసం చేశారని, కాగా టీటీడీ అధిష్టానం ఆమెపై ఏటువంటి చర్యలకు ఉపక్రమించలేదనీ, తమ పార్టీ యందు బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ రాజపుత్ర రజిని పై ఆరోపణలు రాగానే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే సిఫారసు చేశారన్నారు. ఇకనైనా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పై ప్రతిపక్షాలు దుమ్ము ఎత్తి పోసే ప్రసంగాలు, ఆరోపణలు మానుకోవాలని ఆమె హితువు పలికారు. రాజకీయ లబ్ధి కోసం టిడిపి ప్రయత్నం చేస్తోందని, రజినీ వ్యవహారం పూర్తిగా ఆమె వ్యక్తిగతంగా ఆమె పరిగణించారు. వైసిపి పార్టీ నందు నాయకులు క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరిస్తే అధిష్టాన నిర్ణయం మేరకు పార్టీ నుండి సస్పెండ్ చేయటం తప్పదు అని, అధిష్ఠాన నిర్ణయమే శిరోధార్యం ఆమె అన్నారు.
కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కృష్ణ బలిజ పూసల సంఘం డైరెక్టర్ తుపాకుల వెంకట రమణ, సగర కార్పొరేషన్ డైరెక్టర్ మురళీధర్, తొగట వీర క్షత్రీయ కార్పొరేషన్ డైరెక్టర్ చౌడం రవిచంద్ర, ఆరె కటిక డైరెక్టర్ ఉమా మహేశ్వరీ, దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ రాగా నరసింహులు పాల్గొన్నారు.
Comments