వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి పదమూడవ వర్ధంతి సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గం మైదుకూరు రోడ్డు నందు ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత వై.ఎస్ రాజశేఖర రెడ్డి ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా, నాలుగు పర్యాయాలు పార్లమెంట్ సభ్యుడిగా, రెండు పర్యాయాలు పీసీసీ అధ్యక్షుడిగా, రెండు పర్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికై సంక్షేమ పధకాల ద్వారా పేదల పక్షపాతిగా నిలిచి అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని సుస్థిర ముద్ర వేసుకున్నారని కొనియాడారు.
కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్లు, మునిసిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, వైసీపీ పట్టణాధ్యక్షుడు కామిశెట్టి బాబు, మహిళా అధ్యక్షురాలు కోనేటి సునంద, అప్కాబ్ చైర్మన్ మల్లెల జాన్సీ, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ జింకా విజయలక్ష్మి, ఎంపీపీ శేఖర్ యాదవ్, రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, కాకర్ల నాగశేషా రెడ్డి, కౌన్సిలర్లు ఇర్ఫాన్, కమాల్ బాషా, గౌస్, గోపవరం ఎంపీటీసీ భూసం రవీంద్రనాధ్(రవి), మల్లెల రాజారామ్ రెడ్డి, రామాపురం యాకోబు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Comments