ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో విజేతగా ఎంవీ రామచంద్రా రెడ్డి - ధ్రువీకరణ పత్రం అందజేసిన జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి
కడప-అనంతపురము-కర్నూల్ ఉపాధ్యాయ నియోజక వర్గ ఎమ్మెల్సీ ఎన్నికలో అత్యధిక ఓట్లు సాధించిన ఎంవీ రామచంద్రా రెడ్డిని విజేతగా జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ప్రకటించారు. శుక్రవారం జేఎన్టీయూ వర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా ప్రాంగణం వద్ద ఎంవీ రామచంద్రారెడ్డికి ధ్రువీకరణ పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 12 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన ఎన్నికలో ప్రాథమిక ఓట్ల బదిలీ చేస్తూపోగా చివరికి ఇద్దరు అభ్యర్థులు ఎంవీ రామచంద్రా రెడ్డి, ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి పోటీలో నిలిచారన్నారు. ఈ ఎన్నికలో ప్రాధాన్యత ఓట్ల బదిలీ అనంతరం సైతం ఎవరికీ 50 శాతం పైగా ఓట్లు దక్కలేదని, నిబంధనల ప్రకారం అత్యధిక ఓట్లు సాధించిన ఎంవీ రామచంద్రా రెడ్డిని విజేతగా ప్రకటించామని తెలిపారు.
సంపూర్ణ ప్రాధాన్యత ఓట్ల బదిలీ అనంతరం ఎంవీ రామచంద్రా రెడ్డి 10,787 పొందారు. సమీప ప్రత్యర్థి ఒంటేరు శ్రీనివాసులు రెడ్డికి 10,618 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 25,272 ఓట్లు పోలవ్వగా, వాటిలో 3,867 ఓట్లు చెల్లని ఓట్లు/ప్రాధాన్యత బదిలీ అనంతరం విలువ కోల్పోయిన ఓట్లుగా మిగిలాయి.
Commentaires