top of page
Writer's picturePRASANNA ANDHRA

రాచమల్లుకు పూలబాట పరిచి ఘనస్వాగతం

సంక్షేమ పథకాలతోనే పేదల అభ్యున్నతి


- ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన సీఎం జగన్


- గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు

పేదల సుఖసంతోషాలే ధ్యేయంగా జగన్ పాలన సాగుతోందని ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.గురువారం రూరల్ పరిధిలోని రామాపురం గ్రామంలోని ఎస్సీ కాలనీ, హరిజనవాడలలోగడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ వీధులలోని ప్రతి ఇంటి గడపకు ఆయన వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలుకరిస్తూ, సమస్యలపై ఆరా తీస్తూ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ప్రజలనడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు అందడంలేదని దృష్టికి తీసుకొచ్చినవారి ఎదుటే అధికారుల ద్వారా పరిష్కార మార్గాన్ని చూపిస్తున్నారు. వీధులలో నెలకొన్న సనస్యల పరిష్కారంపై ఆయన ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామాపురం ప్రజలు అన్ని ఎన్నికల్లో తనకు తోడుగా ఏకపక్షంగా నిలిచారన్నారు. పార్టీకి ఎన్నిగన్నుగా నిలిచారన్నారు గడపగడప కార్యక్రమాన్ని పండుగ వాతావరణం లో ఘన స్వాగతం ఫలికారన్నారు.నా స్వస్థలం దోరసానిపల్లి పంచాయతీలో ఏ ఎన్నికల్లో కూడా రిగ్గింగ్ చేయలేదని ప్రజాస్వామ్య పద్ధతిలోని ఎన్నికల నిర్వహించానన్నారు.2014 ఎన్నికల్లో 700,2019 ఎన్నికల్లో 1200 మెజార్టీ వచ్చిందని,2024 ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాల కాలంలో 17 కోట్లతో పంచాయతీని అభివృద్ధి చేశానని, ఈ గ్రామం పట్ల అభిమానాన్ని ఉందన్నారు క్రిస్టమస్ సందర్భంగా గ్రామం లోని ప్రతి ఇంటికి 4వేల ఇస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహా రెడ్డి, మండల అధ్యక్షుడు సానబోయిన శేఖర్ యాదవ్, జెడ్పి వైస్ ఛైర్మన్ జైష్టది శారద, పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి బాబు,వైసిపి నాయకులు రామాపురం యాకోబు, కమల్ భాష, భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి, సర్పంచ్ ఆరవ ఈశ్వరమ్మ, మునివర, లక్ష్మినారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


153 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page