రామాయణ సప్తాహం కార్యక్రమాల కరపత్రం ఆవిష్కరణ
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో ఉగాది నుంచి 8 రోజులపాటు నిర్వహించే రామాయణ సప్తాహం కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను శనివారం సాయంత్రం స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలో విడుదల చేశారు. ధర్మాచార్యులు గంగనపల్లి వెంకటరమణ, ఆధ్యాత్మిక ప్రవచకులు కొత్త నరసింహులు, ఆలయ ప్రధాన అర్చకులు యతిరాజం హరినాధ శర్మ, భగవాన్ గీతా సేవా సత్సంగం కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు బొట్టా రామచంద్రయ్య నాయుడు, శ్రీవారి భక్త సేవా సమితి అధ్యక్షులు రఘునాథ్, బద్వేలు సుబ్బరాయుడు, చలువాది రంగస్వామి, అచ్యుత, రామ సుబ్బమ్మ, మహేశ్వరమ్మ, శ్రీదేవి, సుభాషిణి తదితర గీతా సేవా సత్సంగం పారాయణ భక్తులు ఈ కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా గంగనపల్లి వెంకటరమణ, కొత్త నరసింహులు మాట్లాడుతూ 8 రోజుల పాటు నిర్వహించే రామాయణ సప్తాహం కార్యక్రమాలకు భక్తులు విశేషంగా హాజరై కార్యక్రమాలను విజయవంతం చేసి భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు. రామాయణంలోని వివిధ ఘట్టాలను ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు పసుపులేటి శంకర్, అరవ రమణయ్య తదితరులు ప్రతిరోజు ఒక అంశానికి సంబంధించి ఆధ్యాత్మిక ప్రవచనం చేయనున్నారని తెలియజేశారు.
Comments