భక్తిశ్రద్ధ ఆనందోత్సాహాల నడుమ రంజాన్ వేడుకలు - ఈద్ ముబారక్ తెలుపుకున్న ముస్లిం సోదరులు - శాంతి సామరస్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు.
ఈ రోజు ఉదయం పవిత్ర రంజాన్ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించి చిట్వేలి మండల పరిధిలోని ముస్లిం సోదరులు ఆనంద ఉత్సాహాలతో నడుమ రంజాన్ పండుగను జరుపుకున్నారు. ఉదయం నుంచే ముస్లిం సోదరులందరికీ అన్ని పార్టీలవర్గాల వారు, నాయకులు పాటూరి శ్రీనివాసులురెడ్డి, చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, ఎల్ వి మోహన్ రెడ్డి, ఉమా మహేశ్వర్ రెడ్డి, మలిశెట్టి వెంకటరమణ, కేకే చౌదరి, మాదాసు నరసింహ, ఆకేపాటి వెంకట రెడ్డి, అధికారులు, ప్రజలు, పాత్రికేయులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
వేకువజాము నుంచే ముస్లిం సోదరులందరూ నూతన వస్త్రాలను ధరించి మసీదుల నందు మూకుమ్మడిగా ప్రార్థనలు నిర్వహించారు.
మతపెద్దలు ఈద్ విశిష్టతను తెలపుతూ.. మత సామరస్యానికి, సోదరభావానికి, శాంతికి చిహ్నం అని తెలుపుతూ ఒకరికొకరు సోదరభావంతో మెలుగుతూ ప్రపంచశాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పిల్లలు పెద్దలు అందరూ మమేకమై ఒకరికొకరు ఈద్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. తదుపరి ముస్లిం సోదరులు పేదలకు దాన ధర్మాలను నిర్వహించారు.
రంజాన్ పండుగ సందర్భంగా మండల పరిధిలోని ముస్లిం మత పెద్దలైన గాడి.బషీరుద్దీన్,పఠాన్ కరీముల్లా ఖాన్ , షేక్.మొహియుద్దీన్ , షేక్.ఖదిర్ బాషా తదితరులను సదరు ముస్లిం సోదరులు ప్రత్యేకంగా అభినందించారు. వారి సేవలను గురించి గొప్పగా కొనియాడారు. మతాలకతీతంగా వారు నడిచిన దారిలో మేమెప్పుడూ ఉంటూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటు కుంటామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ముస్లిం మత పెద్దలు, మత గురువులు, యువత, పిల్లలు మరియు ఎస్సై వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments