వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు స్థానిక మునివిపల్ కార్యాలయం నందు నియోజకవర్గ ఎం.ఎల్.ఏ రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి నేడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో పట్టణం లో దాదాపు 42 మసీదులు ఉన్నాయని, ముస్లిం సోదరులకు ఈ రంజాన్ మాసంలో మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, ఎల్లవేళలా విద్యుత్ సౌకర్యం కల్పించాలని. ఇప్తార్ విందులలో భాగంగా బ్లీచింగ్ పొడి చల్లి ముఖ్యంగా శానిటేషన్ చేయాలని, ఈద్గా లలో పండుగ రోజున చేసే నమాజ్ కోసం చలువ పందిర్లు ఏర్పాటు చేయాలని మునిసిపల్ అధికారులను కోరారు. మునిసిపల్ కౌన్సిల్ నందు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఒక వైస్ చైర్మన్, ఇద్దురు కోఆప్షన్ మెంబర్లు, తొమ్మిది మంది కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులుగా ఉన్నారని, కావున అత్యంత బాధ్యతగా రంజాన్ పర్వదినాన్ని నిర్వహించాలని కౌన్సిల్ సభ్యులను, చైర్మన్, మునిసిపల్ అధికారులను కోరారు. అయితే వారందరికంటే ముఖ్యంగా ముస్లిం సోదరులను అమితంగా ప్ర్రేమించే వాడిగా తాను ఉన్నానని, కావున ఈ భాధ్యతను తాను తీసుకుంటున్నానని. ముస్లిం సోదరులు ఎక్క్కువగా ఉన్న ప్రాంతాలలో ప్రతి రోజు ఉదయం మంచి నీరు లభ్యం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, వీటితో పాటు అన్ని రకాల సౌకర్యాలు మునిసిపల్ శాఖ నుండి అందిస్తామని తెలిపారు.
ఈ సమావేశానికి ఎం.ఎల్.ఏ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మిదేవి, మునిసిపల్ కమీషనర్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Comments