రేషన్ ఇవ్వలేదని ప్రశ్నిస్తే దాడి చేస్తారా?
ప్రశ్నించిన నాగరాజుకు చెందిన ఫోటో స్టూడియోలోని వస్తువులు ధ్వంసం
మద్యం మత్తులో రేషన్ షాప్ డీలర్ భర్త వీరంగం
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు మండల పరిధిలోని కొత్తపల్లి పంచాయతీలో రేషన్ షాప్ నెంబర్ 143 డీలర్ ప్రతినెలా రేషన్ సరుకులతో పాటు చక్కెరను కూడా లబ్ధిదారులకు ఇవ్వవలసిన బాధ్యత ఉంది, అయితే ఈనెల సదరు డీలర్ రేషన్ సరుకులతో పాటు చక్కెర లబ్ధిదారులకు పంపిణీ చేయడం లేదని కడప జిల్లా కలెక్టర్ కు, అలాగే ప్రొద్దుటూరు తాసిల్దార్ కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, నాగరాజు అనే వ్యక్తిపై దాడి చేసి అతనికి సంబంధించిన ఫోటో స్టూడియో ను ధ్వంసం చేసి దుర్భాషలాడిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.
ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి పంచాయతీ అమృత నగర్ లో అక్కడి లబ్ధిదారులకు రేషన్ డీలర్ చక్కెర ఇవ్వటం లేదు అనే విషయమై గతంలో సోషల్ మీడియా వేదికగా డీలర్ ఆ ప్రాంత యువకులకు మధ్యన మాటల యుద్ధం చెలరేగింది, రేషన్ డీలర్ భర్త అయిన నిజాముద్దీన్ సక్రమంగా ఇక్కడి లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేయడం లేదని ఆయనపై పలు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, తనపను ఎవరైనా ప్రశ్నిస్తే చేస్తే చెప్పుతో కొడతాను అంటూ అదే సోషల్ మీడియా వేదికగా హెచ్చరించిన సంఘటన.
ఈ విషయమై బుధవారం ఒక వ్యక్తి తన గోన సంచి బ్యాగులో రేషన్ చక్కెర ప్యాకెట్లను తన ముందరే తీసుకెళ్తుంటే అమృత నగర్ కు చెందిన ఎన్.ఆర్ ఫోటో స్టూడియో నిర్వాహకుడు ఎన్. నాగరాజు అతనిని ప్రశ్నించారు? అయితే సదరు వ్యక్తి సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోవటంతో, ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నాగరాజు ఇక్కడి డీలర్ ప్రజలకు చక్కెర విక్రయించకుండా అక్రమ మార్గాలలో వాటిని విక్రయిస్తున్నారని, ఈ విషయమై సదరు జిల్లా కలెక్టర్ అలాగే స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదిలా ఉండగా, బుధవారం సాయంత్రం ఫోటో స్టూడియోలో తన పనిలో నిమగ్నమై ఉన్న నాగరాజు పై ఒక్కసారిగా రేషన్ డీలర్ భర్త నిజాముద్దీన్ వారి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడిన సంఘటన. రాళ్లు రువ్వి స్టూడియో అద్దాలు ధ్వంసం చేసి అత్యంత విలువైన కంప్యూటర్ కూడా పగులు కొట్టడం జరిగింది. అడ్డుకున్న స్టూడియో నిర్వాహకుడు నాగరాజు పై కూడా తీవ్రంగా దాడి చేసి దుర్భాషలాడి గాయపరచడం జరిగింది. గాయాల పాలైన నాగరాజు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఔట్ పోస్టులో తనపై జరిగిన దాడి ఘటనపై ఫిర్యాదు చేయడం జరిగింది. లబ్ధిదారులకు ప్రభుత్వం ఇస్తున్న నిత్యావసర సరుకులలో ఒకటైన చక్కెరను ఇవ్వటం లేదని తాను ప్రశ్నించటం వలన తనపై అలాగే తన స్టూడియో పై దాడి చేసి ఆస్తి నష్టం కలిగించారని నాగరాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకొని బాధితునికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాడు.
Comments