కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఒకవైపు రాష్ట ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదవాడి ఇంటింటికి రేషన్ బియ్యం పథకాన్ని అమలు చేసి, ఏ ఒక్కరు అర్ధాకలితో ఉండకూడదు అనే కృత నిశ్చయముతో అటు రేషన్ డీలర్ల దగ్గర నుండి ఇటు సామాన్య ప్రజల వరకు ప్రతి నెలా రేషన్ బియ్యం పంపకాన్ని పక్కాగా అమలు చేస్తున్న, దళారులు అక్రమార్కుల పాలిట వర ప్రదాయని అయ్యింది ఈ పధకం, వివరాల్లోకి వెళితే తాజాగా కడపజిల్లా ప్రొద్దుటూరులో భారీగా రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసు అధికారులు, లింగాపురం లోని పాత ఆటో నగరు ఓ రూమ్ లో భారీగా రేషన్ బియ్యం భద్రపరిచిన గుర్తు తెలియని వ్యక్తి. దాదాపు 300 వందల రైస్ ప్యాకిట్లు ఉన్నటు సమాచారం. ప్రొద్దుటూరు MRO కు సమాచారం అందించిన రూరల్ పోలీసులు.పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ప్రొద్దుటూరు మండలం లింగాపురం ఆటో నగర్ లో అక్రమంగా నిలువ ఉంచిన రేషన్ బియ్యాన్ని బుధవారమే అధికారులు గుర్తించినా గురువారం కూడా మీడియాకు తెలియ పరచలేదు. అక్రమ బియ్యాన్ని పంచనామా చేసి గోడౌన్ కు తరలించాల్సిన అధికారులు గదుల వద్ద పహార ఉంచారు. సాయంకాలం రెవెన్యూ అధికారిని ఓ మీడియా ప్రతినిధి అడుగగా పంచనామా చేయమని డి.టి కి చెప్పానని అన్నారు. డీటీ కి ఫోన్ చేస్తే తాను కడపలో ఉన్నానని ఫోన్ స్విచాఫ్ చేశారు. మరి రేషన్ బియ్యం ఎవరు ఆ గదులను బాడుగకు తీసుకొని ఉంచారు. వారిపై కేసు నమోదు చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారు అన్నది జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు సమీక్షించి పరిశీలించాల్సిన అవసరం ఎంతయినా ఉందన్న వాదన సర్వత్రా వినిపిస్థోంది.
Comentarios