కడప జిల్లా, రాయచోటి
నేడు రాయచోటి పట్టణం లో ఉన్న గాంధీ విగ్రహం దగ్గర ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన తెలియజేసి గాంధీ విగ్రహానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ లో విద్యా వ్యవస్థకు అన్యాయం జరిగిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి తుమ్మల లవకుమార్ వినతి పత్రాన్ని అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గారు ఈరోజు కేంద్ర బడ్జెట్ ని ప్రవేశ పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 11 జాతీయ విద్యా సంస్థలను రాష్ట్రంలో నెలకొల్పడం జరిగింది. ఒక్క జాతీయ విద్యా సంస్థ కి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దుర్మార్గం. దేశ స్థూల జాతీయోత్పత్తి (GDP) లో 6 శాతం నిధులు విద్య కు కేటాయించాలని కొఠారి కమిషన్ చెప్పిన నేడు బడ్జెట్ లో 3.2% మాత్రమే కేటాయించడం జరిగింది. ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మోడీ నేడు బడ్జెట్ లో రాబోయే ఐదు సంవత్సరాలలో 60 లక్షల ఉద్యోగాలు కోసం కృషి చేస్తామని చెప్పడం దేశ యువతను , నిరుద్యోగులను మోసం చేయడమే. దేశవ్యాప్తంగా 5 జాతీయ విద్యా సంస్థలు నెలకొల్పుతామని వాటికి 250 కోట్ల రూపాయలు మాత్రమే నిధులు ఇస్తామని చెప్పారు. ఉన్న యూనివర్సిటీలకు దిక్కు లేకపోతే కొత్తగా డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పడం దుర్మార్గం. నూతన విద్యా విధానం అమలు చేయాలని అధిక నిధులు కేటాయించడం జరిగింది .బాలికల విద్య, ప్రాథమిక విద్యకు తక్కువ మోతాదులో నిధులు కేటాయించారు. పరిశోధనలు చేస్తున్న విద్యార్థుల ఫెలోషిప్ ల గురించి ఏమాత్రం ప్రస్తావన లేదు. కావున ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేయాలని ఆలిండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి కిరణ్ కుమార్, ఏరియా ఉపాధ్యక్షులు లోకేష్, ఏరియా కార్యవర్గ సభ్యులు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments