చారిత్రాత్మక కట్టడాల పరిరక్షణ మనందరి బాధ్యత.
రాయచోటి పట్టణంలో ఉన్న వెయ్యేళ్ల నాటి పురాతన పాత ఈద్గా అభివృద్ధికి 1,00,000/-, లక్ష రూపాయలు విరాళం అందించిన వతన్ గ్రూప్స్ అధినేత కత్వాల్ సాలార్ బాషా అండ్ సన్స్, అనంతరం మీడియాతో మాట్లాడుతూ చారిత్రాత్మక కట్టడాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అందుకు ప్రతి ఒక్కరు సహాయ సహకారలు అందించాలన్నారు
పూర్వం రాయచోటిలో ఒకటే ఈద్గా ఉండేదని తమ పెద్ద వారితో కలిసి ఇక్కడే పవిత్ర రంజాన్ మరియు బక్రీద్ ప్రార్థనలకు వచ్చేవారని అయినా గుర్తు చేశారు. ఈ పాత ఈద్గా మత సామరస్యానికి ప్రతీక అన్నారు. గతంలో పండుగ ప్రార్థనలకు వచ్చే సమయంలో ఇక్కడి పాత రాయచోటి లో ఉన్న హిందూ సోదరులందరూ నీటి వసతి తో పాటు శీతపానీయాలు కూడా అందించేవారని ఆయన గుర్తు చేశారు.
ఈద్గా కమిటీ సభ్యులు రియాజ్ మరియు ఆఫ్తాబ్ మాట్లాడుతూ ఈద్గా అభివృద్ధికి విరాళం అందించిన కత్వాల్ సాలార్ బాషా కు కృతజ్ఞతలు తెలిపారు. దాతలు సహకరించి పురాతన ఈద్గాను మరింత అభివృద్ధి చేయాలని కోరారు. ఈద్గా అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మరియు మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ భాషకు ఈద్గా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
Opmerkingen