top of page
Writer's picturePRASANNA ANDHRA

దేశానికే ఆదర్శంగా నిలిచిన సచివాలయ వ్యవస్ట - శ్రీకాంత్ రెడ్డి

అన్నమయ్య జిల్లా, రాయచోటి (ఆర్ ఎస్ మహమ్మద్ రఫీ)


దేశానికే ఆదర్శంగా నిలిచిన సచివాలయ వ్యవస్ట. వాలంటరీ వ్యవస్థతో ప్రజల వద్దకు సేవలు. ప్రజల సుఖ సంతోషాలే ప్రభుత్వ లక్ష్యం.

రామాపురం మండలంలోని గువ్వలచెరువు, గోపగుడిపల్లె, కసిరెడ్డిగారిపల్లె, నీలకంఠరావుపేట, కల్పనాయుని చెరువు, సుద్దమల్ల గ్రామాల సచివాలయాల వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి .


ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఎం ఎల్ ఏ శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రామాపురం మండలంలోని గువ్వలచెరువు, గోపగుడిపల్లె, కసిరెడ్డిగారిపల్లె, నీలకంఠరావుపేట, కల్పనాయుని చెరువు, సుద్దమల్ల గ్రామాల సచివాలయ వాలంటీర్లుకు వేర్వేరుగా జరిగిన సన్మాన కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ సిపి కన్వీనర్ జనార్దనరెడ్డి, జెడ్ పి టిసి మాసన వెంకటరమణ, స్థానిక ప్రజా ప్రతినిధులుతో కలసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే 1.50 లక్షల మందిని సచివాలయ సిబ్బందిగాను, దాదాపు 2.50 లక్షల మందిని గ్రామ వార్డ్ వాలంటీర్లుగా నియమించారన్నారు.

15 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page