top of page
Writer's pictureDORA SWAMY

అన్ క్లైమ్డ్ డిపాజిట్స్‌ ద్వారా ఆర్బిఐ కు చేకూరిన ఆదాయం ఎంతో తెలుసా..??

రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తాజా రిపోర్ట్ ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరంలో రూ 35,000 కోట్ల విలువైన అన్ క్లైమ్డ్ డిపాజిట్స్‌ ని దేశంలోని పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు ఆర్బీఐకి ట్రాన్స్‌ఫర్ చేశాయి.

అంటే ఈ మొత్తం డబ్బు డిపాజిట్ చేసిన వ్యక్తులు ఈ సమాచారాన్ని వారి నామినీలకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ ఇవ్వలేదు. దీంతో గత 10 ఏళ్లుగా సదరు బ్యాంకుల్లోని 10.24 కోట్ల అకౌంట్లకు చెందిన రూ 35,000 కోట్ల సొమ్మును ఎవరూ క్లైయిమ్‌ చేయలేదు. దీంతో బ్యాంకులు ఆ సొమ్మును ఆర్బీఐకి ట్రాన్స్‌ ఫర్ చేశాయి.

మనం ఏదైనా బ్యాంకు ఎఫ్ డీ లేదా డిపాజిట్ స్కీమ్‌ లో పెట్టిన పెట్టుబడి మెచ్యూరిటీ తర్వాత 10 ఏళ్లు లేదా ఆపైన క్లైయిమ్‌ చేయకపోతే వాటిని అన్‌క్లైయిమ్డ్ బ్యాంక్ డిపాజిట్స్‌ అంటారు. టర్మ్‌ డిపాజిట్లు 10 ఏళ్ల పాటు ఆపైన క్లైయిమ్‌ చేయకపోతే వాటిని అన్‌క్లైయిమ్డ్ బ్యాంక్ డిపాజిట్స్‌గా పరిగణిస్తారు. బ్యాంక్ సేవింగ్స్‌ అకౌంట్స్‌ లోని సాధారణ డిపాజిట్లకు కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. 10 ఏళ్ల పాటు బ్యాంకు ఫిక్స్‌ డ్ డిపాజిట్ ని క్లైయిమ్ చేయకపోతే ఆ డిపాజిట్ను సదరు బ్యాంకు తమ హెడ్ ఆఫీస్ కి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. మెచ్యూర్ అయిన టర్మ్‌ డిపాజిట్‌ లో క్లెయిమ్‌ చేయని మొత్తానికి సేవింగ్స్‌ అకౌంట్ వడ్డీ రేటు లేదా సదరు టర్మ్‌ డిపాజిట్ వడ్డీ రేటులో ఏది తక్కువ అయితే ఆ వడ్డీ వర్తిస్తుంది. ఆ నిధులు ఎడ్యుకేషన్ అవేర్ నెస్‌ ఫండ్ కి ట్రాన్స్‌ ఫర్ చేస్తారు. ఈ ఫండ్ లో 10 ఏళ్లు లేదా ఆపైన ఇన్ యాక్టివ్‌గా ఉన్న అన్ క్లెయిమ్డ్ టర్మ్‌ డిపాజిట్స్, బ్యాంక్‌ అకౌంట్స్‌ నిధులు ఉంటాయి. బ్యాంకులు ప్రతీ నెలా తమబ్రాంచ్‌లలోని అన్‌ క్లెయిమ్డ్ డిపాజిట్స్‌ సొమ్మును ఈ ఫండ్ కి బదిలీ చేస్తాయి.

ప్రజలు ఈ అన్‌క్లైయిమ్డ్ బ్యాంక్ డిపాజిట్స్‌ తీసుకోవడానికి ఇబ్బందులు లేకుండా ఆర్బీఐ ఏర్పాట్లు చేసింది. బ్యాంకులన్నీ తమ వద్ద ఉన్న అన్‌క్లైయిమ్డ్ బ్యాంక్ డిపాజిట్స్‌ వివరాలను తమ వెబ్ సైట్ లో అకౌంట్ హోల్డర్ పేరు అడ్రస్‌లని అందుబాటులో ఉంచాలని కోరింది. కొన్ని బ్యాంకులు పాన్ నెంబర్, ఫోన్ నెంబర్ ఆధారంగా డిపాజిట్స్‌ వివరాలు తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. అన్‌క్లైయిమ్డ్ బ్యాంక్ డిపాజిట్స్‌ ని తిరిగి తీసుకునే పద్ధతిని బ్యాంకులు తమ వెబ్‌ సైట్స్‌ లో ఉంచాలని ఆర్బీఐ కోరింది. కాబట్టి బ్యాంక్‌ వెబ్ సైట్ నుండే మనం అన్‌క్లైయిమ్డ్ బ్యాంక్ డిపాజిట్స్‌ తిరిగి తీసుకోవచ్చు.

నిపుణులు ఏమంటున్నారంటే..


మీరు ఏదైనా బ్యాంక్‌ నుండి హోమ్‌ లోన్‌ తీసుకుంటే దురదృష్టవశాత్తూ మీరు మరణించిన తర్వాత .. ఆ లోన్ రీపే చేయలేకపోతే బ్యాంకులు మీ వారసులను వెతికిమరీ వారిని లోన్‌ రీపేచేయలాని సమాచారం ఇస్తాయి. అదే బ్యాంకు డిపాజిట్ల విషయానికి వస్తే మీ మరణానంతరం మీ వారసులకు ఆ డిపాజిట్ సమాచారన్ని బ్యాంకులు ఇవ్వవు. కాబట్టి ప్రతీ ఒక్కరు ముఖ్యంగా వయో వృద్ధులు తమ బ్యాంకు డిపాజిట్ల సమాచారాన్ని కచ్చితంగా మీ కుటుంబ సభ్యులకు వెంటనే ఇవ్వండి. లేదంటే మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము బ్యాంకుల పాలవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘తెలివైన వారు తమ ఆస్తి సంపద సరైన వ్యక్తులు అర్హులకు అందేలా చూస్తారని చాణక్యుడి సూక్తి ఉంది. డబ్బున్నోళ్లకి బినామీలు ఉంటారు మరి సామాన్యుడికి కనీసం నామినీ లేక పోతే ఎలా? అందుకే తెలివిగా ఆలోచించి మీ పెట్టుబడులు డిపాజిట్ల వివరాలు మీ కుటుంబ సభ్యులకు తప్పకుండా చెప్పండ’ని సూచిస్తున్నారు.

7 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page