అగనంపూడి ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి,
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటం తో రూపొందించిన 2022 క్యాలెండర్ ను ఏ.డి.సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ ఆవిష్కరించారు. అగనంపూడి పునరావాస కాలనీ పినమడక గ్రామంలో దళిత గ్రామీణ అభివృద్ధి కార్మిక యువజన సేవా సంఘం అధ్యక్షులు, అంబేద్కర్ విగ్రహం వ్యవస్థాపకులు పులగపూరి అప్పారావు, బలిరెడ్డి సత్యనారాయణ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి ద్వితీయ య వార్షికోత్సవం సందర్భంగా పి అప్పారావుని సత్కరించడం జరిగింది. అనంతరం భారతరత్న అంబేద్కర్ చిత్ర పటం కూడిన క్యాలెండర్ ను బలిరెడ్డి సత్యనారాయణ ఆవిష్కరించి ఆయన మాట్లాడుతూ భారతరత్న అంబేద్కర్ ఏ దేశంలోని లేని విధంగా ప్రజలందరికీ సమానంగా ఉన్నతమైన హక్కులు కల్పించి ఇండియన్ పీనల్ కోర్టు సెక్షన్లు చట్టంలో పొందుపరిచి దేశ రాజ్యాంగాన్ని నిర్మించిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని ఆయన ఆశయాలు భావితరాల యువకులు ముందుకు తీసుకుపోవాలని బలిరెడ్డి పిలుపునిచ్చారు. ఆశారాజ్ షైనింగ్ సొసైటీ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ పి ఆశాలత సభాధ్యక్షతన జరిగిన సమావేశంలో అఖిలపక్ష, ప్రజా సంఘ నాయకులు గోడి రామకృష్ణ,శంకర్ చంద్రశేఖర ,కడిమి హనుమంతరావు, కొలిపాక అప్పారావు ,ఎల్లపు సాంబశివరావు ,కత్తి తిలక్ ప్రదీప్ చంద్ర ,తోటడ చంద్రమౌళి, అండబోయిన మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments