భూ కబ్జాలు, భూ అక్రమాదారులపై రెవిన్యూ అధికారుల నిర్లక్ష్యన్ని సహించం - రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు రామాజీ ఇమ్మనుయల్
వైయస్సార్ జిల్లా, జమ్మలమడుగులో రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు రామాజీ ఇమ్మానుయేల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిరవహించారు. భూ కబ్జాలు, భూ అక్రమణదారులపై రెవెన్యూ డివిజన్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రామాజీ ఇమ్మానుయేల్ మండిపడ్డారు. జమ్మలమడుగు లోని ఆర్టీసీ బస్టాండ్ నుండి పాత బస్టాండ్ లోని అంబేద్కర్ సర్కిల్ వరకు శాంతియుత నిరసన ర్యాలీ చేశారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రాన్ని అందచేశారు. భూమిలేని నిరుపేదలకు భూములు ఇవ్వకుండా అగ్రవర్ణాల వాళ్ళు వందల ఎకరాలు స్టీల్ ప్లాంట్లకు తీసుకుంటుంటే ప్రభుత్వం పట్టించుకోలేదని రామాజీ ఇమ్మానియేల్ అన్నాడు. దళితుల సత్తా ఏమిటో వచ్చే 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నిరూపిస్తామని అలాగే భూ అక్రమణదారులపై అధికారులకు ఫిర్యాదు చేయడానికి వెళితే కోర్టుకు వెళ్ళమని చెప్పడం విడ్డూరమని రామాజి ఇమ్మానుయేలు తెలిపాడు.ఈ కార్యక్రమంలో మురళి ప్రసాద్ వినోద్ కుమార్ ఓబన్న వెంకట రమణ,సాగర్,అరుణ్ కుమార్ ప్రసాద్ ck కుమార్ లు పాల్గొన్నారు.
Comments