ఆర్కే హెల్పింగ్ హాండ్స్ ద్వారా నిత్యావసర సరుకుల వితరణ
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు మండలం, నంగనూరు పల్లె పంచాయతీ పరిధిలోని మదర్ తెరిసా వృద్ధాశ్రమం నందు కువైట్ కు చెందిన ఆర్కే హెల్పింగ్ హాండ్స్ వారు ఆదివారం సాయంత్రం వృద్ధాశ్రమం నందు 20వేల రూపాయల విలువగల నిత్యావసర సరుకులు వితరణ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి కుమారుడు 13వ వార్డు మెంబర్ కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, షరాబు సంఘం అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది కే. మధుసూదన్, సగర సంగం మాజీ డైరెక్టర్ మురళీధర్, సూర్యనారాయణ రెడ్డి, ఆదరణ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు బైసాని సత్యనారాయణ, రామ తులసి ఫౌండేషన్ వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, ప్రతినెల ఆర్కే హెల్పింగ్ హాండ్స్ వారు జిల్లా వ్యాప్తంగా దాదాపు 13 వృద్ధాశ్రమాలకు సరుకులు వితరణ చేయడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. కువైట్ నందు ఉద్యోగాలు చేసుకుంటూ తమ ప్రాంత ప్రజలకు సేవనందిస్తున్న ఆర్కే హెల్పింగ్ హాండ్స్ కు కృతజ్ఞతా భావంతో మెలగాలని కోరారు.
Comments