దళితుల హక్కులు కాలరాస్తున్నారు - ఆర్.యెన్ రాజా
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
సోమవారం ఉదయం స్థానిక కొఱపాడు రోడ్డు లోని ఎన్జీవో హోమ్ నందు రాయలసీమ ఎస్సీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు పెద్దిరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత సంఘ సమావేశానికి ఎస్పీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.యెన్ రాజా ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా దళితుల కోసం తాము ఎన్నో ఉద్యమాలు త్యాగాలు చేశామని, అదే ఉద్యమ పంధా కొనసాగిస్తు నేడు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశామని, భారత దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్భై యేండ్లు పైబడినా దళితులకు మాత్రం స్వతంత్రం రాలేదని, దళిత ఆడబిడ్డలపై అత్యాచారాలు, దళిత యువకులపై అనుచిత ప్రవర్తన దాడులు జరుగుతున్న కేసులు నమోదు చేయని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
అంటరానివారిగా తమను చూస్తున్న తీరును ఆయన ఖంధించారు, బిఆర్ అంబెడ్కర్ ఆశయాలతో తాము ముందుకు వెళ్తున్నామని రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, విద్యా, ఉపాధి రంగాలలో రాణిస్తున్నామని, దళితులను చైతన్యవంతులను చేసి తమపై దాడులు చేస్తున్న వారికి బుద్ధి చెప్పి రాష్ట్రంలో కొత్త విధానానికి శ్రీకారం చుడతామని, అంబెడ్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తూ రాజ్యాంగ అమలు కోసం దళితులుగా తాము ముందుకు వెళతామని తెలిపారు. దళితులకు కార్పొరేషన్లో నిధులు కరువయ్యాయని, దళితుల ఎదుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తోందని, ఎస్పీ కార్పొరేషన్ ద్వారా దళితులు ఆర్ధికంగా ఎదగటం రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చటం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో రాయలసీమ అధ్యక్షుడు పెద్దిరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళి ప్రసాద్, మాల ఐక్య వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్, ఎస్సీ సంక్షేమ సంఘం యూత్ లీడర్ బి. చందు, పలువురు సీనియర్ దళిత నాయకులు, మేధావులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments