తరచూ అర్ధరాత్రి సమయాన లేక తెల్లవారుజామున వాహన ప్రమాదాలు ఎందువలన జరుగుతున్నాయి?
వాహన చోదకులు నిర్లక్ష్యం వలన
అతివేగంగా వాహనం నడపటం వలన
తెల్లవారుజామున నిద్ర మత్తులో
డ్రైవర్ కు సరయిన నిద్ర లేకపోవటం
కడప జిల్లా చాపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
తిరుమల శ్రీవారి దర్శనాన్ని ముగించుకొని తిరిగి వస్తుండగా అనంతలోకాలకు
ఆగి ఉన్న లారీ రూపంలో మృత్యు ఒడిలోకి
మృతులు, క్షతగాత్రులు ప్రొద్దుటూరు వాసులుగా గుర్తింపు
ముగ్గురు మృతి, మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు
వివరాల్లోకి వెళితే మైదుకూరు మండల కేంద్రమైన చాపాడు లోని జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. మృతి చెందిన వారు పాలెం అనూష (35), కుడుముల ఓబులమ్మ (45), కుడుముల రామలక్ష్మ (48) గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మరో యెనిమిది మంది గాయపడ్డారు, ప్రొద్దుటూరు పట్టణంలోని వై.ఎమ్.ఆర్ కాలనీకి చెందిన కుడుముల గంగాధర్ రెడ్డి, కుడుముల గంగిరెడ్డి, పాలెం విజయ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు అంతా మొత్తం పదమూడు మంది ఈనెల 18వ తారీకు బుధవారం నాడు తిరుమలకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు, వారు దర్శనం చేసుకుని తిరిగి ఇంటికి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినది. టెంపో AP03TD1899 అనే నెంబర్ గల వాహనంలో వీరు చాపాడు వద్దకు రాగానే రోడ్డు మీద నిలిచి ఉన్న KA34B7617 అనే నెంబర్ గల బొగ్గు లారీని ఢీకొనడంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు, గాయపడిన వారిలో అనంతపురం జిల్లాకు చెందిన పొట్లూరు శివరామిరెడ్డి, గంగా అనిత, ఆర్లగడ్డ కు చెందిన అన్యం జయలక్ష్మి, హైదరాబాద్ కు చెందిన పాలెం విజయ్ కుమార్ రెడ్డి, ప్రొద్దుటూరు కు చెందిన కదిరి రామకృష్ణారెడ్డి, గంగిరెడ్డి రామానుజమ్మ, డ్రైవర్ ఆంజనేయులు రెడ్డి ఉన్నారు. వీరిని చికిత్స కోసం ప్రొద్దుటూరు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. టెంపో వాహనం లారీని ఢీకొనడంతో దాని ముందు భాగం కొంతవరకు దెబ్బతిన్నది. మూడు మృతదేహాలకు ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
תגובות