టైరు పేలడంతో తుఫాన్ వాహనానికి భారీ ప్రమాదం - సోమయాజుల పల్లె ఘాట్ రోడ్ లో ప్రమాదం - క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు.
సోమయాజుల పల్లె ఘాట్ రోడ్లో తుఫాన్ వెహికల్ ప్రమాదానికి గురయ్యింది . కర్నూల్ నుంచి నంద్యాల కి పోతూ టైర్ పగలడం తో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ వెహికల్ లో 11 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వేగం మీద ఉన్న వాహనం టైరు పగిలిపోవడంతో ఒక్కసారిగా కంట్రోల్ తప్పి ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.
క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం కొంతమందిని నంద్యాలకు మరి కొంతమందిని కర్నూలుకు ఆసుపత్రులకు తరలించినట్లు సమాచారం. సంబంధిత బాధితుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Comments