కడప జిల్లా, రాయచోటి పట్టణంలోని మాండవ్య నది ఒడ్డున వెలసివున్న శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఆలయాన్ని గురువారం తెలంగాణ రాష్ట్రం ఆర్టీసీ ఎండీ వి.సి.సజ్జన్నార్ దంపతులు సందర్శించి వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈఓ మంజుల, వేదపండితులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజలు అనంతరం సజ్జన్నార్ దంపతులను ఆలయ ఈవో, వేదపండితులు సన్మానించి స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు. తన ఇలవేల్పు శ్రీ వీరభద్ర స్వామి అని సజ్జన్నార్ అన్నారు. ఎంతో పురాతనమైన రాయచోటి వీరభద్ర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం జరిగిందన్నారు.
రాయచోటి వీరభద్ర స్వామి ఆలయం చాలా పురాతనమైనదని ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారని తాను కూడా 22 సంవత్సరాల నుంచి వీరభద్ర స్వామి దర్శించుకోవడం జరుగుతూ వస్తోందని నాటి నుండి నేటి వరకు ఆలయం చాలా అభివృధ్ధి జరిగిందన్నారు. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆలయ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని ఆయనని అభినందించారు. తాను సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని తన ఇంటి దైవం వీరభద్ర స్వామి అన్నారు.
గతంలో తాను పులివెందుల ఏఎస్పీ గా, కడప ఎస్పీ గా పనిచేశానని ఈ ప్రాంత వాసులతో తనకు అనుబంధం ఉందని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ వి.సి.సజ్జన్నార్ అన్నారు. ఆయన వెంట అర్భన్ సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్ఐ నరసింహారెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ రమేష్ బాబు, మున్సిపల్ ఆర్ఐ మల్లికార్జున ఉన్నారు.
Comments