గత కొద్ది రోజులుగా విద్యుత్ ఉద్యోగులకు జీతాలు మరియు పెన్షనర్ లకు పెన్షన్ లు చెల్లించటం లో జరుగుతున్న జాప్యంపై రాష్ట్రం లో ఉన్నటువంటి అన్ని ట్రాన్స్కో, జన్కో మరియు డిస్కం ల కార్యాలయాల యందు నిరసన తెలుపుతున్నారు. దానిలో భాగంగా ఈ రోజు కూడా యాజమాయనికి మరియు ప్రభుత్వానికి వ్యతిరేకంగా RTPP లో పెద్ద ఎత్తున్న నిరసన తెలిపారు.
పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ప్రకారం ఫిక్స్డ్ చార్జెస్ రూపంలో ఉద్యోగుల జీతాలకు సంబందించిన డబ్బులు నెల నెలా చెల్లిస్తున్నపుడు, జెన్కో లో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు చెల్లించే విషయం లో జాప్యం ఎందుకు జరుగుతా ఉందో తమకు అర్థం కావటం లేదని RTPP ఉద్యోగులు వాపోతున్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఆర్టీపీపీ జేఏసీ నాయకులు ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రైవేటు విద్యుత్ సంస్థలకు బొగ్గు కొనుగోలుకు మరియు ఇతరత్రా వాటి కోసం ముందస్తు చెల్లింపులు చెల్లిస్తూ ఉన్నారని, అదే ప్రభుత్వ సంస్థ అయిన జెన్ కో కు అటువంటి సౌలభ్యం కల్పించ పోగా జెన్కో లో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వకపోవడం దారుణమని అన్నారు ఈ కార్యక్రమంలో మలేష్ జగదీశ్వర్ రెడ్డి సుబ్బారెడ్డి హరి ఓబుల్ రెడ్డి పి గంగాధర్ కొండారెడ్డి గంగాధర్ RTPP JAC నాయకులు పాల్గొన్నారు
Comments