కలమల్ల వాసులు మంచోళ్ళు
ఆర్ టి పి పి.నుంచి వస్తున్న ప్లైయాష్ ట్యాంకర్లు, టిప్పర్లు, ట్రాక్టర్లు కలమళ్ళ గ్రామం వైపు వెళ్తూ ప్లైయాష్ పూల వర్షం కురుస్తున్నట్టు కురుస్తున్న భరిస్తూనే ఉన్నారు. అభ్యంతరం చెప్పే నాయకుడే లేడు, ఎందుకంటే కలమల్ల గ్రామ ప్రజలు మంచోళ్ల, లేక అమాయకుల అర్థం కానీ ప్రశ్న.
కలమల్ల గ్రామ ప్రజలు మాత్రం దుమ్ము ధూళితో రోగాలను భరిస్తూ, రోజురోజుకు గ్రామ ప్రజల ఆయుష్షు తగ్గిపోతుందనీ తెలియడం లేదు. కాలుష్యాన్ని పీల్చుకుంటూ రోగాల బారిన పడి బాధలను అనుభవిస్తున్న, అన్ని భరిస్తున్నారు తప్ప ఎవ్వరికి చెప్పరు, అన్ని తెలిసి మోసం చేస్తున్నా ఆర్టీపిపి యాజమాన్యం గానీ, ప్రజా ప్రతినిధులు గాని కన్నెత్తి కూడా చూడని వైనం ఎందుకంటే కలమల్ల గ్రామ ప్రజలు అమాయకులు, ఎక్కడో ఎర్రగుంట్లలోనో కమలాపురంలోనో కడప లోనో ప్లైయాష్ ట్రాక్కులను ట్రాక్టర్ లను ఆ గ్రామ ప్రజలు అడ్డుకుంటాన్నారు, కానీ కలమళ్ళ మీద ఇంత కాలుష్యం వెదజల్లుతున్న, ఆర్టీపీపీ మీద కలమల్ల గ్రామ ప్రజలు నోరు మెదపడం లేదు, ఇది అంతు చిక్కున ప్రశ్నని మేధావులు నోర్లు వెళ్ళబోడుతున్నారు రు వెనకాల ఏదో పెద్ద రహస్యం దాగి ఉందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇట్లనే ఊరికే ఉంటారా లేకపోతే గ్రామ ప్రజల ఆరోగ్యలపై నాయకులు గళం విప్పరు అనేది ప్రశ్న.
Comments