ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేయాలి.
ఆర్.టి.పి.పి శనివారం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల దీర్ఘకాలిక సమస్య అయిన సంస్థ విలీనం, రెగ్యులరైజేషన్, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కరెంట్ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీపిపి కాలనీలోని 1535 యూనియన్ ఆఫీస్ వద్ద ఆర్టిపిపి కాంట్రాక్ట్ కార్మికుల సమావేశాన్ని జేఏసీ ఆధ్వర్యంలో పొట్టిపాటిబాబు అధ్యక్షతన ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో జేఏసీ ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ గారు 9.11. 2017లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సుదీర్ఘ పాదయాత్ర నందు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల వయస్సు విద్యార్హతలను పరిగణలోకి తీసుకొని వీలైనంత మందిని రెగ్యులరైజ్ చేస్తానని బహిరంగ సభలలో చెప్పడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని నిలదీయడం జరిగిందని, నేటి ప్రభుత్వం మూడున్నర సంవత్సరాలు వచ్చినప్పటికీ విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్ పరిష్కారంలో ఎలాంటి పురోగతి లేని కారణంగా జేఏసీ ఏర్పాటు చేసుకుని దాని ద్వారా వివిధ రకాల ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడం జరిగుతున్నదని. ఈ ఆందోళన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం వైపు నుంచి ఒక సానుకూలత వస్తుందనే ఆశా బావం తో నిరసనలు తెలియజేస్తున్నాము అని, కానీ యాజమాన్యం నుంచి గానీ ప్రభుత్వం నుండి కానీ ఎలాంటి స్పందన లేని కారణంగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా జెన్కో ట్రాన్స్కో డిస్కములలో ఉన్నటువంటి కార్మికులందరినీ సంఘటితం చేయుటకు వివిధ రూపాలలో కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమాల ద్వారా ఎలాంటిపురోగతి ప్రభుత్వం వైపునుంచి కానీ యాజమాన్యం వైపు నుంచి కానీ స్పందన లేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
దుర్గారావు చీఫ్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ కార్మికుల జీవితాలలో మార్పులేని కారణంగా కార్మికులు నిరాశ నిస్పృహలతో విధి లేని పరిస్థితుల్లో రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి నేటి ప్రభుత్వాలు కల్పిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా యాజమాన్యం ప్రభుత్వ తీరు మార్చుకొని దశాబ్దాల నుండి విద్యుత్ రంగాన్ని నమ్ముకుని చాలి చాలని వేతనాలతో కొట్టుమిట్టాడుతున్న కార్మికుల కుటుంబాలను ఆదుకుని తెలంగాణ రాష్ట్రం లో లాగా వెలుగులు నింపాలని కోరారు.
సమావేశానికి ఉద్యోగ సంఘ నాయకులు ఏఐటీయూసీ H 64 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి P శివయ్య, 1535 యూనియన్ నాయకులు రామకృష్ణారెడ్డి, సిఐటియు నాయకులు కొండారెడ్డి, jR మోహన్, 155యూనియన్ నాయకులు ఎన్ శ్రీనివాసులు, యూనియన్ ఏఐటియుసి 64 యూనియన్ నాయకులు ఎం గంగాధర్, సిఐటియు జిల్లా కార్యదర్శి మనోహర్, సిపిఎం నాయకులు సత్యనారాయణ పాల్గొన్నారు. అలాగే ఆర్టిపిపి రీజనల్ జేఏసీ నాయకులు అధ్యక్షులు పొట్టిపాటి బాబు, శ్రీనివాసులు, కన్వీనర్ ఎన్ రాము, ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, ట్రేసర్లు కార్మిక వర్గం పాల్గొనడం జరిగింది.
Comentários