దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి నివాళి.
రైతు దినోత్సవాన మహిళా రైతు రామసుబ్బమ్మకు సన్మానం.
మెలకువలతోనే అధిక దిగుబడి సాధ్యమన్న మహిళా రైతు.
అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం కే ఎస్ అగ్రహారం గ్రామ సచివాలయంలో... ఈరోజు వైయస్సార్ జయంతి దినోత్సవం గా రైతు దినోత్సవం ను జరుపుకుంటున్న తరుణంలో సదరు గ్రామ ఆర్ బి కే ఉద్యాన అధికారి కళ్యాణ్ ఆధ్వర్యంలో రైతు దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కేఎస్ అగ్రహారానికి చెందిన మహిళ రైతు పెనగాని రామసుబ్బమ్మకు ఘనంగా సత్కరించారు. ఆర్ బి కే అధికారి కళ్యాణ్ మాట్లాడుతూ... ఈ మహిళా రైతు తన రెండు ఎకరాల పొలంలో అరటి,పసుపు, బొప్పాయి తదితర వాణిజ్య పంటలను సాగు చేస్తూ అత్యధిక స్థాయిలో దిగుబడి సాధిస్తూ ఉందని ప్రస్తుతం సాగులో ఉన్న బొప్పాయి పంట నుంచి రెండు ఎకరాలకు గాను మొదటి కోత లోనే 18 టన్నుల దిగుబడిని సాధించి ధర 12 తో విక్రయించి ముందంజలో నిలిచిందని ఆమె అందరికీ ఆదర్శమని పేర్కొనగా; జీవ రసాయనక ఎరువులు, అధికారుల సలహాలు,పంట మార్పిడి, ఎప్పటికప్పుడు పంట సాగులో మెలకువలు, ఆర్ బి కే అధికారుల సలహాలు పాటించడం వల్లే ఇది సాధ్యమైందని బాధిత రైతు రామసుబ్బమ్మ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చిట్వేలి మండల ఉప ఎంపీపీ సుబ్రహ్మణ్యం రెడ్డి, గ్రామ నాయకులు సుబ్బారెడ్డి, పంచాయతీ స్పెషలాఫీసర్ ఓబులేసు, పంచాయతీ సెక్రటరీ చైతన్య, సచివాలయ సిబ్బంది తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments