సామాజిక బస్సు యాత్రను జయప్రదం చేయండి - వైసిపి
రేపటి నుంచి రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ 'సామాజిక సాధికారత' బస్సు యాత్ర..
గత 53 నెలల సామాజిక విప్లవాన్ని, సంక్షేమాభివృద్ధిని వివరించనున్న నేతలు..
ఉత్తరాంధ్రలో ఇచ్ఛాపురం, కోస్తాలో తెనాలి, రాయలసీమలోని శింగనమలలో ఒకేసారి ప్రారంభం
ప్రతి రోజూ 3 చోట్లా ఒక్కో నియోజకవర్గంలో యాత్ర; ఒక్కో ప్రాంతంలో బహిరంగ సభ
ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ సమన్వయకర్త సారధ్యంలో డిసెంబరు 31 వరకూ యాత్ర
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ సామాజిక న్యాయం పాటించిన పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉంది అంటే అది వైయస్సార్సీపీ నే అని ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం ప్రొద్దుటూరు ఆర్ అండ్ బి అతిథి గృహం నందు ఏర్పాటు చేసిన పార్టీ నాయకుల, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జోన్లను ఏర్పాటు చేసి సామాజిక సాధికారత బస్సు యాత్రను 26వ తేదీ నుండి ప్రారంభించనున్నామని, ఇందులో భాగంగా 28వ తేదీన మొదటిగా కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి బస్సు యాత్ర ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. రాజకీయపరంగా అన్ని వర్గాలకు వైసీపీ ప్రాధాన్యతనిస్తోందని బస్సు యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ, పదివేల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. కావున నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న ఈ బస్సు యాత్రను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం వైఎస్ఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు కడప మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలకు తమ పార్టీ ప్రాధాన్యతనిచ్చిందని సామాజిక న్యాయం పాటించి 60 శాతం నామినేటెడ్ పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు కట్టబెట్టిందని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో కడప నగర మేయర్ వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు కె.సురేష్ బాబు, ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఆప్కాబ్ చైర్మన్ ఝాన్సీ, రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాస్ రెడ్డి, ఉద్యాన శాఖ సలహాదారుడు సంబటూరు ప్రసాద్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ భీమినిపల్లి లక్ష్మి దేవి నాగరాజు, కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివాచంద్రా రెడ్డి, పలు శాఖల డైరెక్టర్లు, చైర్మన్లు, మెంబర్లు, కౌన్సిలర్ల, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Comments