కేంద్రీయ విద్యాలయం శాశ్విత భవనానికి కలెక్టర్ స్పందన ప్రశంసనీయం - సాయి లోకేష్
రాజంపేట, పట్టణంలోని కేంద్రీయ విద్యాలయం శాశ్విత భవనానికి జిల్లా కలెక్టర్ గిరీష పి.ఎస్ స్పందించిన తీరు ప్రశంసనీయమని బిజెపి రాష్ట్ర పొలిటికల్ ఫీడ్ బ్యాక్ కమిటీ సభ్యులు, రాజంపేట పార్లమెంటు ఇన్చార్జి సాయి లోకేష్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి లోకేష్ మాట్లాడుతూ రాజంపేట పట్టణంలో వేలాదిమంది పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన కేంద్రీయ విద్యాలయకు శాశ్వత భవనాన్ని సాధించేందుకు బీజేపీ నాయకులుతో కలిసి ఈనెల 15వ తేదీన జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగిందని తెలిపారు. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ పాఠశాల భవనానికి 10.25 ఎకరాలు స్థలం కేటాయిస్తూ సంబంధిత శాఖకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని అన్నారు. త్వరలోనే పట్టణంలో కేంద్రీయ విద్యాలయ పాఠశాలకు శాశ్వత భవన నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. కోరిన తక్షణమే స్పందించి పాఠశాల శాశ్వత భవనానికి అనుమతులు ఇచ్చిన జిల్లా కలెక్టర్ గిరీష పి ఎస్ కు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. కాగా పాఠశాల పక్కాభవనానికి విశేషంగా కృషిచేసిన సాయి లోకేష్ కు పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు, పట్టణ ప్రజలు శాలువాతో ఘనంగా సత్కరించి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
Comments