పర్యావరణ పరిరక్షణే ధ్యేయం - శానిటరీ ఇన్స్పెక్టర్
రాజంపేట, పర్యావరణ పరిరక్షణే అందరి ధ్యేయం కావాలని శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన క్లాప్ ప్రోగ్రాం లో భాగంగా పురపాలక కమిషనర్ ఎం. జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్ ఆధ్వర్యంలో ఆదివారం పురపాలక కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ వరకు స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు. ముందుగా పురపాలక కార్యాలయ ఆవరణలో పురపాలక పరిధిలో పారిశుధ్య నిర్వహణకు సంబందించి సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి కొత్త బస్టాండ్ కూడలిలో మానవహారంగా ఏర్పడి ప్రజలకు తడి, పొడి చెత్త పైన అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్లాస్టిక్ ను సంపూర్ణంగా నిషేధించి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రజలు సహకరించాలని ఈ సందర్బంగా ఆయన కోరారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, మెప్మా సభ్యులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
Comments