పెదగంట్యాడ ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, పెదనడుపూరు శ్రీ సంకటవిమోచన గణపతి ఆలయ వార్షికోత్సవం సందర్బంగా ఆలయ కమిటీ పెద్దలు మంత్రి నరసింహమూర్తి ఆద్వర్యంలో ప్రత్యేకపూజలు నిర్వహించి భక్తులకు అన్నసమారాదన జరిపారు. గాజువాక బీజేపి కో-ఆర్డినేటర్ కరణంరెడ్డి నరసింగరావు పాల్గొని ప్రత్యేకపూజులు నిర్వహించారు. కమిటీ పెద్దలు సాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేసారు. ఈ సందర్బంగా నరసింగరావు మాట్లాడుతూ విశాఖ జిల్లాలో భక్తుల కోర్కెలను తీర్చే గొప్ప ఆలయంగా మన నడుపూరు సంకటవిమోచన గణపతి ఆలయంకి ప్రసిద్దిగాంచినదని ఆలయ కమిటీ పెద్దల ఆద్వర్యంలో అన్నసమారాదన పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రామన్ , రామస్వామి రాజశేఖర్ బారీగా భక్తులు పాల్గొన్నారు.
top of page
bottom of page
Comentarios