SBI ఆధ్వర్యంలో స్వచ్ఛతా హి సేవ 2024
వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్వచ్ఛతా హి సేవ - 2024 కార్యక్రమం తలపెట్టగా, దేశవ్యాప్తంగా బిజెపి పార్టీ శ్రేణులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రభుత్వ అధికారులు, మున్సిపాలిటీ ఉద్యోగులు ఇందులో భాగస్వాములై తాము శుభ్రంగా ఉండటమే కాకుండా తమ పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకునే నినాదాన్ని ప్రజలలోకి తీసుకొని వెళుతున్నారు.
ఇందులో భాగంగా ప్రొద్దుటూరు క్లస్టర్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు నేటి ఉదయం ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్ వద్ద మానవహారంగా ఏర్పడి స్వచ్ఛతా హి సేవ నినాదాలు చేశారు. అనంతరం శివాలయం వీధి, టిబి రోడ్డు మీదుగా గాంధీ రోడ్డు లోని మహాత్మ గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని తదుపరి టీబీ రోడ్డు లోని అనిబిసెంట్ మున్సిపల్ హై స్కూల్ ఆవరణంలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కడప రీజినల్ మేనేజర్ శ్రీవాణి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, స్వచ్ఛతా హి సేవ కార్యక్రమాన్ని గత ఆదివారము కడపలో నిర్వహించామని, అలాగే నేడు ప్రొద్దుటూరు నందు నిర్వహిస్తున్నట్లు, పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత అని మనం నివసించే ఇల్లు పనిచేసే కార్యాలయాలతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రొద్దుటూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు పాల్గొని మున్సిపల్ హై స్కూల్ మైదానం నందు చెత్తను తొలగించి మైదానాన్ని శుభ్రపరిచారు.
Comentarios