ప్రసన్న ఆంధ్ర, ప్రొద్దుటూరు, జూన్ 29
నాకు న్యాయం కావాలి.
గతంలో వైద్య వృత్తినే వ్యాపారంగా ఎంచుకున్నాను అని స్పష్టీకరించిన ప్రొద్దుటూరు లోని ఒక ప్రముఖ వైద్యురాలు.
అవయవాలు సరిగా లేకున్నా చెప్పకుండా తన బిడ్డ నరకానికి కారణం అవుతున్న స్కానింగ్ సెంటర్ లపై చర్యలు తీసుకోవాలి.
జిల్లా కలెక్టర్ కు, ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకూ ఎలాంటి స్పందన లేదు.
దాతల సహకారంతో ఇప్పటివరకు వైద్యం చేయిస్తున్నా.
కన్నీటి పర్యంతమై బిడ్డను చూపిస్తూ ప్రెస్ క్లబ్ లో సమావేశం.
నాకు న్యాయం కావాలి... నా బిడ్డ నరకయాతనకు కారణమైన స్కానింగ్ సెంటర్ల వైద్యులపై కఠిన చర్యలు తీసుకొని మరో తల్లికి, బిడ్డకు ఇలాంటి దారుణమైన పరిస్థితి రాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఓ తల్లి కన్నీటిపర్యంతమైన రోదిస్తూ తన బాధను ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్ నందు బుధవారం మీడియాకు చెప్పుకుంది. బాధితుల మాటల్లోనే వివరాలు.
పట్టణంలోని శాంత కుమారి వీధిలో నివాసం ఉంటున్న బొబ్బురి సంజమ్మ , సోమేశ్ లకు రెండవ సంతానం ఆడబిడ్డ జన్మించింది. కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్న సోమేశ్ తన భార్యను పట్టణంలోని వైద్యులు సృజన వద్ద చూపిస్తున్నారు. 5వ నెలలో బిడ్డకు టిఫా స్కానింగ్ ను బాలాజీ స్కానింగ్ సెంటర్ డాక్టర్ సింధు వద్ద అ వైద్యురాలు సిఫారసు మేరకు చేయించారు. అప్పుడు బిడ్డకు 19 వారాల 4 రోజులని రిపోర్ట్ ఇచ్చి, అన్ని అవయవాలు బాగున్నాయని నిర్ధారించారు. అలాగే ఆరవ నెలలో వైద్యురాలు సూచన మేరకు బృందా స్కానింగ్ సెంటర్లో డాక్టర్ రవి కుమార్ వద్ద స్కాన్ చేయించారు. అక్కడ కూడా అవయవాలన్నీ బాగున్నాయని నార్మల్ అని రిపోర్ట్ ఇచ్చారు. ఏడవ నెలలో కూడా అదే స్కానింగ్ సెంటర్లో అదే వైద్యుల వద్ద స్కానింగ్ చేయించినప్పుడు కూడా కడుపులోని బిడ్డకు ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. ఈ విధంగా 9 వ నెలలో సంజమ్మకు కడుపునొప్పి రావడంతో వైద్యురాలు వద్దకు వెళితే మళ్ళీ బృంద స్కానింగ్ సెంటర్లో స్కానింగ్ చేయించినప్పుడు కూడా ఆల్ ఓకే అని రిపోర్ట్ ఇచ్చారు. కొంచెం ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు బిడ్డ యూరిన్ పోయాక పోవడంతో నొప్పి వచ్చిందని మందులు రాసి ఇచ్చి పంపారు. అయితే మరోసారి కడుపునొప్పి రావడం మరలా స్కానింగ్ చేయించడంతో కిడ్నీ వాపు వచ్చిందన యూరిన్ పోయకపోవడంతో సమస్య ఏర్పడిందని రెండు రోజుల్లో తగ్గిపోతుందని వివరించారు. ,అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో కడుపునొప్పి తీవ్రం కావడంతో వైద్యురాలు వద్దకు వెళితే కేసు సీరియస్ అని, పాప పాస్ పోయకపోవడంతో కర్నూలుకు తీసుకెళ్లాలని చెప్పారు. బంధువులు వాగ్వాదానికి దిగడంతో కొన్ని షరతులు మేరకు వైద్యురాలు సిజేరియన్ చేసి బిడ్డను తీశారు. బిడ్డను కర్నూలుకు తీసుకెళ్లాలని చెప్పారు. 35 వేల రూపాయల ఫీజును కూడా వైద్యులు తీసుకున్నారు. బిడ్డను కర్నూలుకు తీసుకొని వెళితే అక్కడ గుండెపోటు వచ్చేంత విషయాన్ని చెప్పారని, ఎడమవైపు కిడ్నీ లేదని, వెన్నపూసలో ఎల్ 4 , ఎల్ 5 ఎముకలు లేవని , యూరిన్ వచ్చే దారి సరిగా లేదని, మోషన్ వచ్చే దారి ఉండాల్సిన చోట లేకుండా పైకి ఉందని, పెద్ద ప్రేగు మెలితిరిగి ఉందని రెండు రోజులు చికిత్స చేసి 45 వేల రూపాయలు ఫీజు తీసుకొని పంపించేశారు.
చెన్నైలో దాతల సహకారంతో చికిత్స.
దీంతో బిడ్డను కడప, తిరుపతి , కర్నూలు ఇలా అన్ని ఆసుపత్రిలో తిప్పిన అందరూ ప్రొద్దుటూరు స్కానింగ్ చేసిన డాక్టర్లను తిట్టటం తప్ప మరేమీ చేయలేకపోయారు. స్కానింగ్ చేసిన సమయంలో అని అవయవ లోపాలు ఉంటే ఎందుకు చెప్పలేదని తల్లిదండ్రులను ప్రశ్నించడం తప్పా మెరుగైన వైద్యం ఆ బిడ్డకు అందించే సాహసం ఎవరూ చేయలేదు. కొద్ది రోజుల క్రితం చెన్నైలో ఆస్పత్రిలో బిడ్డను చేర్చి ఒక ఆపరేషన్ చేయించారు. యూరిన్ వచ్చేందుకు మరో చోట ఏర్పాటు చేయడంతో బిడ్డ పడుతున్న నరకయాతన అంతా ఇంతా కాదు. కారకులైన స్కానింగ్ సెంటర్ల వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయరామరాజుకు, వైద్యాధికారులకు ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు చర్యలు లేవని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డకు ఇంతటి దారుణమైన పరిస్థితి వచ్చిందని తాము పడుతున్న బాధ మరే తల్లిదండ్రి పడకూడదని రోదిస్తూ చెప్పారు. తనకు న్యాయం కావాలని అని తన బిడ్డకు వైద్యం అందించేందుకు అధికారులు ముందుకు రావాలని కోరారు.
Comments