విజ్ఞానం ప్రతి మానవునికి మానసిక వికాసం కలిగిస్తుంది
పరిసరాల విజ్ఞానం ప్రతి మానవునికి మానసిక వికాసాన్ని కలిగిస్తుందని మండల విద్యాశాఖ అధికారి నాగయ్య తెలిపారు. మంగళవారం నాగిరెడ్డి పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సైన్స్ ఫెయిర్( కౌశల్) పోటీలను నిర్వహించారు. పోటీలలో వ్యక్తిగత విభాగంలో జ్యోతిబాపూలే బిసి గురుకుల పాఠశాల విద్యార్థిని కే .మేఘ వాటర్ హార్వెస్టింగ్ సిస్టం ప్రదర్శించి ప్రథమ స్థానంలో నిలిచింది. గ్రూపు విభాగంలో నందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు బి. రితీష్, టి. నాగేంద్రాలు 3 డి హలో గ్రామ్ ప్రదర్శించి ప్రధమ స్థానంలో నిలిచారు. ఉపాధ్యాయ విభాగంలో నాగిరెడ్డిపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రసాయనిక శాస్త్ర ఉపాధ్యాయురాలు విజయ్ కుమారిలు మండల స్థాయిలో గెలుపొంది జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో నందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శ్రీనివాసులు, జిల్లా అఫ్ కాస్ట్ సమన్వయకర్త రవి శంకర్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments