జాతీయ సైన్స్ దినోత్సవం ను కడప జిల్లా ప్రొద్దుటూరులో ఘనంగా నిర్వహించారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పొద్దుటూరు శాస్త్రి నగర్ లో ఉన్న నారాయణ ఒలంపియాడ్ స్కూల్ లో ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు సైన్స్ ఫెయిర్ నిర్వహించామని పాఠశాల రీజినల్ ఇంచార్జ్ నజీర్ అహ్మద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన వివిధ రకాల సైన్స్ ప్రయోగాలు ఆకట్టుకున్నాయి. ఇలాంటి సైన్స్ ఫెయిర్ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత బయటపడుతుందని, వారికి తరగతిలోని పాఠశాల పై అవగాహన పెరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఈ కార్యక్రమంలో లో తల్లిదండ్రులు, పాఠశాల అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ రెడ్డయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
top of page
bottom of page
Comentarios