జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్వేల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులకు క్విజ్ , వ్యాసరచన, చిత్రలేఖనం, వకృత్వ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కృష్ణ మూర్తి మాట్లాడుతూ మానవ జీవితం సమస్తం విజ్ఞాన శాస్త్రం తో ముడిపడి ఉందని, విజ్ఞాన శాస్త్రం లేనిదే విశ్వం లేదని , విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ఎంతో మంది శాస్త్రవేత్తలు తమ ప్రాణాలు సైతం త్యాగం చేశారని అలాంటి విజ్ఞానాన్ని చెడు కోసం కాకుండా, మంచి కోసం, సమాజ శ్రేయస్సు కోసం, ఉపయోగిస్తే ప్రపంచం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పాఠశాల స్థాయిలో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల చేతుల మీదుగా మెడల్స్ ఇవ్వడం జరిగింది. సైన్స్ యొక్క ప్రాముఖ్యతను తెలిపే పాటలకు విద్యార్థులు నృత్య ప్రదర్శన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
కాగా మండల పరిధిలోని శ్రీ పద్మావతి హై స్కూల్ నందు కరస్పాండెంట్ మాదినేని లత లావణ్య ఆధ్వర్యంలో 6-10 తరగతి పిల్లలకు వారిలోని సృజనాత్మకతను వెలికితీస్తూ.. పిల్లలు చేసిన వివిధ ప్రయోగాలను పాఠశాల లో ప్రదర్శించి శాస్త్ర రంగంలో నోబుల్ బహుమతి గ్రహీత సర్ సివి రామన్ చేసిన కృషిని.. సైన్స్ డే యొక్క ప్రాముఖ్యత విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.
Comments