కడప జిల్లా కడప నగరం నందు నేడు SEEDAP (సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ & ఎంటర్ప్రైస్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్) DRDA కడప జిల్లాలో, కడప మరియు శ్రీ సిటీ నందు వివిధ కంపెనీలలో నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ కడప జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ వి. విజయ్ రామ రాజు ఐఏఎస్, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ. మురళి మనోహర్ ఆధ్వర్యంలో టీటీడీసీ ట్రైనింగ్ సెంటర్ నందు ఈరోజు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశారు, నిరుద్యోగ యువత పెద్దఎత్తున ఇంటర్వ్యూలకు హాజరు కాగా రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇండియా బుల్స్ తదితర MNC కంపినీల ప్రతినిధులు హాజరు అయ్యారు, ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ మురళి మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ నిర్మూలన దిశగా అడుగులు వేస్తోంది అని, జిల్లాలోని ప్రతి నిరుద్యోగి ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కనీస విద్యార్హత 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ లేదా ఐటీఐ పాస్ అయినా వారు అర్హులని. ఇంటర్వ్యూలలో పాల్గొననున్న నిరుద్యోగులు తమ తమ వెంట ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డును తప్పనిసరిగా తెచ్చుకోవాలని తెలిపారు. అయితే నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఈ ఇంటర్వ్యూలలో పాల్గొని తమ అర్హతకు తగ్గ ఉద్యోగాన్ని సంపాదించుకొన్నారు, ఉద్యోగాలు పొందిన వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
top of page
bottom of page
Comments