హెచ్ఎం పురుషోత్తం రెడ్డి అభినందనలు.
విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు స్కూల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ జి ఎఫ్ ఐ )ఆధ్వర్యంలో
2023 - 24 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో అండర్ -14 , 17 విభాగాల్లో ఈనెల 7 8 తేదీల్లో ఉన్నత పాఠశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు నియోజకవర్గస్థాయిలో ఓబులవారిపల్లి మండలం బొమ్మవరం లో గత రెండు రోజులుగా నిర్వహించిన పలు క్రీడల్లో చిట్వేలు ఉన్నత పాఠశాల నుంచి 15 మంది విద్యార్థి, విద్యార్థులు మరియు అథ్లెటిక్స్ విభాగంలో 6 మంది జిల్లా స్థాయికి ఎంపికైనట్లు ప్రధాన ఉపాధ్యాయులు పురుషోత్తం రెడ్డి గురువారం తెలిపారు.
వాలీ బాల్ అండర్ -17 బాలుర విభాగం లో రఘునాథ్,యువరాజ్, నితిన్ కుమార్,బాల్ బ్యాడ్మంటన్ లో ఇర్ఫాన్ బాషా, ఖోఖో బాలుర లో రఘు నాథ్, మోక్షగ్న; బాలికలలో హల్లిలుయా, హర్షిత, త్రో బాల్ నందు మహారాణి, రూపా,
అండర్ -14 ఖోఖో బాలికల విభాగం లో కీర్తి, సుజిత,వనజ; వాలీబాల్ బాలుర విభాగంలో లిఖిత్ వర్మ,అవినాష్ ఎంపిక కాగా...
అథ్లెటిక్స్ విభాగంలో జావిలింగ్ త్రో లో ప్రథమ స్థానం లో శివ నందిని,షాట్ పుట్ , డిస్క్ త్రో ప్రథమ స్థానం సంజన, బాయ్స్ డిస్క్ త్రో లో వెంకట రమణ ప్రథమ స్థానం దక్కించుకోవడం జరిగిందన్నారు.
జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక అయిన విద్యార్థులను మరియు శిక్షణ ఇచ్చిన ఫిజికల్ డైరెక్టర్ సుహాసిని, షబ్బీర్ అహ్మద్ మరియు సహాయ సహకారాలు అందించిన ఉపాధ్యాయులు చిన్నబాబు ను ప్రధానోపాధ్యాయులు పురుషోత్తం రెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ రెడ్డమ్మ అభినందించారు.
Comentarios