ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి - సీనియర్ సివిల్ జడ్జి సరస్వతి
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
ప్రజలు చట్టాల పైన అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి ఎన్.సరస్వతి తెలియజేశారు. అదనపు జిల్లా జడ్జి కోర్టు నందు శనివారం ప్రత్యేక లోక్ ఆదాలత్ నిర్వహించారు. ఈ లోక అదాలత్ నందు ఆర్ వి వి ఎస్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో విడాకుల కేసును పరిష్కరించి భార్యా-భర్తల కాపురాన్ని చక్కదిద్దారు. అనంతరం మండల పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా వ్యవహరించిన సీనియర్ సివిల్ జడ్జి సరస్వతి మాట్లాడుతూ బాండు కాల వ్యవధి మూడు సంవత్సరాలని, మూడు సంవత్సరాల లోపు కోర్టు నందు ఫైల్ చేసుకుంటే న్యాయం జరుగుతుందన్నారు. మూడు సంవత్సరాల కాల వ్యవధి దాటిన తర్వాత ఆ బాండ్ చెల్లదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు శ్రీనివాసులు, గిరీష్, జనార్ధన్, భరత్, మస్తాన్, షాహిద్ లు పాల్గొని వివిధ చట్టాల పైన ప్రజలకు అవగాహన కల్పించారు.
Comments