top of page
Writer's pictureDORA SWAMY

తల్లి తండ్రి తర్వాత గురువులదే ఆస్థానం.ఆత్మీయ సభలో పూర్వ విద్యార్థుల వెల్లడి.

గురు తరానికి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సభ.

--గురువులకు పాదాభివందనం చేసిన విద్యార్థులు.

--చదువుకున్న స్నేహితులతో ఆత్మీయ ఆలింగనాలు.

--ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమా మహేశ్వర్ రెడ్డి.




జన్మనిచ్చేది తల్లిదండ్రులయితే దిశ దశ నిర్దేశం చేస్తూ బ్రతుకు బాటను బంగారు బాటగా భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడంలో తల్లి తండ్రి తర్వాత భగవంతుని కంటే ముందుగా గురువుకు ఇచ్చిన స్థానం మాకు ఎప్పటికీ పదిలం అంటూ చిట్వేలి మండల పరిధిలో 1990 1995 వ్యవధిలో విద్యనభ్యసించి విద్యార్థులు వివిధ రంగాలలో ఉన్నత స్థానాలలో బిజీ బిజీగా ఉంటున్నప్పటికీ విద్యను బోధించిన గురువుల విశేష కృషిని గుర్తు చేసుకుంటూ ఈ రోజున అన్నమయ్య జిల్లా చిట్వేలి జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాల నందు "పూర్వ విద్యార్థుల ఆత్మీయ సభ" ను పూర్వ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు.



జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాలలో తమకు విద్యను బోధించిన గురువులు విశ్రాంత ఉపాధ్యాయులు గా కొందరు వయోవృద్ధులై నడవలేనప్పటికీ వారిని బాధ్యతగా ఒక చోటకు కూర్చి వారందరినీ గొప్పగా సన్మానిస్తూ వారి బోధన వల్ల తాము ఈ స్థితికి చేరుకున్నామని తెలుపుతూ తమ ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగబాధ్యతలను అందరితో పంచుకుంటూ తమ తమ సుఖ సంతోషాలను అటు గురువుల తోనూ ఇటు తన తోటి విద్యార్థులతోనూ ఒకరికొకరు గడిచిన 25 సంవత్సరాల కాలాన్ని ఒక్కసారి వెనక్కు గుర్తు చేసుకుంటూ తిరిగి విద్యార్థిదశలో కెళ్ళి తమ కళ్లెదురుగా ఉన్న తమ గురువులకు మీ వల్లే మేము ఇంతటి వారం అయ్యాము అంటూ చెబుతూ అందరి గురువులకు పాదాభివందనాలు చేస్తూ మరికొందరు భోజనం తినలేని గణిత మాస్టర్ మోహన్ కి భోజనాన్ని తినిపిస్తూ నడవలేని పీఈటీ ఉపాధ్యాయులు ఆవుల గోవిందయ్య తో పంచిన అనుబంధాలను ఆయన సభలో పలికిన మాటలు అందరిని ఆలోచింప చేస్తూ ప్రతి వ్యక్తి ఎంత సంపాదించారు కాదన్నది ముఖ్యం తన జీవితంలో ఏమి సాధించాలి అన్నది ముఖ్యం అన్నదానికి ఉదాహరణగా సూచించబడుతూ "గురువు అన్నవారు నిక్కచ్చిగా తన విధులు నిర్వహిస్తే ఎప్పటికీ వారి స్థానం తల్లి తండ్రి తరువాత గురువులదే అన్నమాట నిజం చేస్తూ"ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.



ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఉన్నత స్థానాల్లో ఉన్న విద్యార్థులందరూ పేద స్థితిలో ఉన్న మరొకరికి చేయూతనివ్వాలని ఎక్కడ ఉన్నా సమాజం గుర్తించునట్లు ఉన్నతంగా వ్యవహరించాలని "ఉన్నంతలో సంతృప్తిగా జీవించాలని" పేర్కొన్నారు.



ముఖ్య అతిథిగా పాల్గొన్న చిట్వేలు గ్రామ ఉపసర్పంచ్ ఉమా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి విద్యార్థి దశ జీవితంలో కీలకమని అలాంటి దశలో మన వ్యక్తిత్వాన్ని చక్కదిద్దేది కేవలం గురువులేనని అట్టివారికి సన్మానించడం మన అదృష్టమని అన్నారు.


ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గణిత మాస్టారు మోహన్, సైన్స్ ఉపాధ్యాయులు ఆలం, శివరామరాజు, సోషియల్ ఉపాధ్యాయులు వెంకటరెడ్డి, రంగారెడ్డి, దోనెల రవీంద్రనాథ్, హిందీ పండిట్ రఘునాథ్, నరేంద్రనాథ్, దొండ్లవాగు శ్రీనివాసులు మరియు1990-1995 విద్యనభ్యసించన పూర్వపు విద్యార్థులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


450 views0 comments

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page