top of page
Writer's pictureEDITOR

కార్మికులను నిరాశపర్చిన కేంద్ర బడ్జెట్

కార్మికులను నిరాశపర్చిన కేంద్ర బడ్జెట్


జాతీయ యూనివర్సిటీలకు కేంద్ర బడ్జెట్ నిధులు కేటాయింపులో మొండి చెయ్యి


ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు మరిచిపోయిన కేంద్ర ప్రభుత్వం


ప్రసన్న ఆంధ్ర -రాజంపేట :


కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామణి ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లు కార్మికులను నిరాశపరిచిందని, జాతీయ యూనివర్సిటీలకు కేంద్ర బడ్జెట్ నిధులు కేటాయింపులు ముందు చేయి చూపించిందని, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల ఊసే లేదని సిఐటియు జిల్లా కార్యదర్శి చిట్వేలు రవికుమార్ ధ్వజమెత్తారు.

జీవో ప్రతులను దగ్ధం చేస్తున్న నాయకులు

పట్టణంలోని గాంధీజీ విగ్రహం ఎదుట సిఐటియు, ఎస్ఎఫ్ఐ, వ్య.కా.స ఆధ్వర్యంలో గురువారం కేంద్ర బడ్జెట్ బిల్లుకు నిరసన తెలిపి బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు.


ఈ సందర్బంగా సిఐటియు జిల్లా కార్యదర్శి సి.రవికుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులను నిరాశపరిచే విధంగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం చాలా దుర్మార్గమన్నారు. పేద, మధ్యతరగతి వారికి ఈ బడ్జెట్ నిరాశ పరిచిందని అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు కడప ఉక్కు పరిశ్రమ, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ సాధించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఎంపీలను ఒత్తిడి చేసే విధంగా ఉండాలని తెలిపారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరసింహ సర్వేపల్లి మాట్లాడుతూ ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏ.ఐ.ఎస్.హెచ్.ఈ 2020-21) ప్రకారం 2020-21లో ఎస్సీ విద్యార్థుల నిష్పత్తి 14.2%కి పడిపోయిందని., అంతకుముందు సంవత్సరం 14.7% ఉండేదని తెలిపారు. ఓబీసీ విద్యార్థుల నిష్పత్తి 37% నుండి 35.8%కి మరియు ముస్లిం విద్యార్థులు 5.5% నుండి 4.6%కి పడిపోయిందని అన్నరు. వికలాంగుల విభాగంలో విద్యార్థుల సంఖ్య కూడా 92,831 నుండి 79,035కి పడిపోయిందని అన్నారు. ఈ అసమాన విద్యార్థుల నిష్పత్తులన్నీ గత అనేక సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాల ఫలితంగా ఏర్పడుతున్నాయని తెలిపారు. విద్యారంగంలో అమలు చేయబడిన ప్రబలమైన నయా-ఉదారవాద విధానాల ఫలితం కూడా ఇది విద్యను అధిక ప్రైవేటీకరణకు దారితీసిందని, అట్టడుగు వర్గాల విద్యార్థులను మరింత బహిష్కరణకు నెట్టివేసిందని అన్నారు. ఒకటో తరగతికి చేరిన విద్యార్థుల్లో దాదాపు సగం మంది ఉన్నత పాఠశాలలోనే విద్యను ముగించవలసి వస్తుందని.. హయ్యర్ సెకండరీ విద్యను పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్యలో ప్రవేశించే భారతీయ విద్యార్థుల సంఖ్య ఇప్పటికీ 30% కంటే తక్కువగా ఉందని తెలిపారు. మాకు ఉన్నత విద్య, కొత్త కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు, ప్రతి ప్రాంతంలో మెరుగైన సౌకర్యాలు, ఉన్న ప్రభుత్వ పాఠశాలలు మరియు ఫెలోషిప్‌లు, ఉచిత స్టడీ మెటీరియల్‌లు, హాస్టళ్లు, సరైన మధ్యాహ్న భోజన పథకం మొదలైన వాటితో సహా అణగారిన వర్గాల విద్యార్థులకు తగినంత నిధులు అవసరం అన్నారు. ఈకార్యక్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తల్లికాలమ్మని, కెవిపిఎస్ జిల్లా కన్వీనర్ పెంచలయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రమణ, కార్తీక్, ఉపేంద్ర, అఖిల్, వీఆర్ఏల సంఘం జిల్లా నాయకులు శంకర్, మణి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకురాలు లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.


3 views0 comments

コメント

5つ星のうち0と評価されています。
まだ評価がありません

評価を追加
bottom of page