ప్రాక్టికల్స్ పేరుతో అక్రమాలకు పాల్పడిన ప్రైవేట్ జూనియర్ కళాశాలల పై విచారణ జరిపించాలి: ఎస్.ఎఫ్. ఐ
ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
ప్రాక్టికల్స్ పేరుతో అక్రమాలకు పాల్పడిన కార్పొరేట్ ప్రైవేట్ జూనియర్ కళాశాలల పై విచారణ చేపట్టాలని ఆర్ఐఓ రమణరాజు విచారణ జరిపి చర్యలు తీసుకొవాలని (భారత విద్యార్థి ఫెడరేషన్) ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరసింహ సర్వేపల్లి శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లాలో ప్రస్తుతం ఇంటర్, ఒకేషనల్ ప్రాక్టికల్స్ జరుగుతున్నాయని.. రాయచోటి, రైల్వేకోడూరు, రాజంపేట ప్రాంతాల్లో కార్పొరేట్, ప్రైవేట్, ఒకేషనల్ ఎయిడెడ్ కళాశాలల యాజమాన్యాలు ప్రాక్టికల్స్ లో అధిక మార్కులు వేస్తామని చెప్పి ఎటువంటి రసీదు ఇవ్వకుండా రూ 1300 లు నుండి రూ 2000 వేలు వరుకు విద్యార్థుల తల్లిదండ్రులు నుండి అక్రమంగా వసూలు చేశారని అన్నారు. దీని వలన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని రాయచోటి, కోడూరు, రాజంపేట ప్రాంతంలోని ఒకేషనల్ జూనియర్ కళాశాలలో డమ్మీ అభ్యర్థులతో ప్రాక్టికల్స్ చేపిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఆర్ఐఓ రమణ రాజు స్పందించి ఆయా కళాశాలలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్.ఎఫ్. ఐ గా డిమాండ్ చేశారు.
Comentários