మా ఊరి రాములోరి కళ్యాణానికి మీరందరూ రా రండి: రాజుకుంట గ్రామ ప్రజలు.
భగవత్ స్వరూపం నుంచి మానవ రూపాన్ని దాల్చి ప్రజల్లో మమేకమై.. దశరధునికి కొడుకుగా, సీతమ్మకుభర్తగా, లక్ష్మణునికి అన్నగా, అయోధ్య ప్రజలకు రాజుగా ప్రజలందరికీ అనుసరనీయుడిగా, మనందరం ఆరాధించే దైవంగా శ్రీ సీతారాముల దేవాలయం లేని ఊరు ఉండదు.
ఈ కోవలోనే కువైట్ దేశంలో ఉన్న రాజుకుంట గ్రామప్రజలు మరియు గ్రామస్తుల సహకారంతో నిర్మితమై ప్రతినిత్యం పూజలందుకుంటున్న శ్రీసీతారామ లక్ష్మణ సమేత విగ్రహ దేవాలయం నందు శ్రీరామ నవమి మొదలు ఎనిమిది రోజులపాటు సాయంత్రం పూట భజన కార్యక్రమాలు ప్రసాదాలు పంపిణీ విరివిగా జరుగుతాయి. తొమ్మిదవ రోజైన చివరి రోజున ఉత్సవ విగ్రహాలకు కల్యాణాన్ని నిర్వహించి అన్నదానం కళ్యాణ విగ్రహాలను ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలన్నింటినీ గ్రామంలోని ప్రజలందరూ సామరస్యంతో, సానుకూలం తో ఆనందోత్సాహాల మధ్య నిర్వహించడం ఇక్కడ పరిపాటి.గ్రామ ప్రజల మాటల్లో...
చిట్వేలు మండల పరిధిలోని రాజుకుంట గ్రామమైన మా ఊరి నందు రేపటి రోజున 18/4/2022 సోమవారం న ఉదయం శ్రీసీతారాముల కు కళ్యాణాన్ని నిర్వహించి మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు ఉంటాయని మండల పరిధిలోని అందరూ ఆహ్వానితులే నని నిర్వాహకులైన గ్రామ ప్రజలు పేర్కొన్నారు.
Comments