top of page
Writer's pictureMD & CEO

స్కిట్ కళాశాలను JNTU లో విలీనం చేయాలన్న ప్రతిపాదన పరిశీలన

రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని ఏకైక ఇంజనీరింగ్ కళాశాల అయినా శ్రీ కాళహస్తీశ్వర ఇంజనీరింగ్ కళాశాల ను కొనసాగించేలా చేయాలన్న పట్టుదలతో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్కిట్ కళాశాలను JNTU లో విలీనం చేయాలన్న ప్రతిపాదన పై మరోసారి ఉన్నత స్థాయిలో ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ మేరకు JNTU వైస్ ఛాన్స్లర్ సోమవారం శ్రీకాళహస్తి లో కళాశాలను పరిశీలన చేశారు. కళాశాల భవనాలు, ఫ్యాకల్టీ తదితర సాంకేతిక సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనతరం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తో సమావేశమై స్కిట్ కళాశాల ను విలీనం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జెఎన్టియు వైస్ ఛాన్స్లర్ గారు మాట్లాడుతూ, దేవస్థానం ఆధ్వర్యంలోనీ కళాశాలను జేఎన్టీయూ లో విలీనం చేయడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ ప్రతిపాదన తీసుకెళ్లి ఆమోదం తెలిపే విధంగా ఎమ్మెల్యే సహకారంతో ప్రక్రియ చేపట్టడానికి జె.ఎన్.టి.యు కమిటీలో చర్చించనున్నట్లు వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి స్కిట్ కళాశాలను తీసుకువెళ్లి విలీనం చేసే విధంగా ప్రభుత్వం నుంచి అనుమతి సాధించేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా కళాశాలను సందర్శించి ప్రభుత్వం నుంచి అనుమతి ఇచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, స్కిట్ కళాశాల అధ్యాపకులు, స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు.


17 views0 comments

댓글

별점 5점 중 0점을 주었습니다.
등록된 평점 없음

평점 추가
bottom of page