పూరీ ఆలయంలోకి స్మార్ట్‌ఫోన్లపై పూర్తి నిషేధం
ఒడిశాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథస్వామి ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 13వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయంలోకి స్మార్ట్‌ఫోన్లు తీసుకెళ్లడంపై పూర్తిస్థాయిలో నిషేధం విధించారు. వచ్చే ఏడాది నుంచే ఈ నిర్ణయం అమలులోకి రానుంది. స్మార్ట్‌ఫోన్లపై నిషేధాన్ని జనవరి 1వ తేదీ నుంచే అమలు చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. గతంలో భక్తులకు మాత్రమే ఈ ఆంక్షల్ని అమలు చేసిన యంత్రాంగం.. ఇప్పుడు ఆ పరిమితులను పోలీస్ సిబ్బందితో పాటు అందరికీ వర్తింపజేస్తున్నట్టు శ్రీ జగన్నాథ ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించే ముందు సేవకులు కూడా తమ స్మార్ట్‌ఫోన్లను డిపాజిట్ చేస్తారని పేర్కొన్నారు. ఫోన్లను భద్రపరిచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్టు శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్(ఎస్‌జీటీఏ) చీఫ్ అడ్మినిస్ట్రేటర్ వీర్ విక్రమ్ యాదవ్ మీడియాకు చెప్పారు. అధికారులు, సేవకులు ఫొటోలు, వీడియోగ్రఫీ ఫీచర్లు లేని సాధారణ ఫోన్లు మాత్రం తీసుకొని వెళ్లొచ్చన్నారు.
Comments