స్టీల్ ప్లాంట్ ప్రసన్న ఆంధ్ర వార్త
తృప్తి సొసైటీ ఎన్నికల్లో సిఐటియు ఘనవిజయం
స్టీల్ ప్లాంట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తృప్తి సొసైటీ ఎన్నికలు శనివారం అనగా 29/ 10/ 2022 నిర్వహించడం జరిగింది. ఎన్. రామారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ తృప్తి సొసైటీలో 5 కోట్ల నుంచి 400 కోట్లకు తీసుకెళ్లిన సిఐటి ప్యానల్ కి ఇంత అభివృద్ధి చేయడానికి. గల కారణం సిఐటియు 27 సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మా మీద నమ్మకం ఉంచిన వారందరికీ కూడా పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
అయోధ్య రామయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయిస్ తరఫు నుంచి 9 9350 ఓట్లు పోలింగ్ కాగా అందులో తిరస్కరించబడిన ఓట్లు 225 మొత్తం మీద ఈ యొక్క కార్యక్రమంలో సిఐటియు ఘన విజయం సాధించడం జరిగింది. ఇందులో భాగంగా సిఐటియు తరఫునుంచి మొత్తం ఐదుగురు అభ్యర్థులు పోటీ చేయగా 5 గెలవడం సంతోషకరంగా ఉందని తెలియపరిచారు .
ఈ కార్యక్రమంలో సిఐటియు తరఫున మా సిఐటి అభ్యర్థులకు కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ. మరింత పురోగతి చెంది ప్లాంట్ భవిష్యత్ తరాలకు అందే విధంగా ప్రైవేటీకరణ కాకుండా చూడాలని తృప్తి సొసైటీ మెంబర్లు ఎటువంటి నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా ఉండి మన యొక్క సిఐటి మరింత అభివృద్ధి బాటలో నడిపి స్టీల్ ప్లాంట్ లాభాల్లో వచ్చేలాగా ప్రయత్నించాలని ప్రతి కార్మికుడికి కూడా తృప్తి సొసైటీ లాభం ఉండే విధంగా సిఐటియు ప్యానల్ నిర్వహిస్తారని తెలియజేశారు.దీనిలో ఈ కార్యక్రమంలో సిఐటియు ప్యానల్ తరఫునుంచి గెలిచిన అభ్యర్థులు
1)కే ఆనందకుమార్, 3983 ఓట్లతో;
2)కర్రీ శ్రీను, 3923 ఓట్లు;
3)డి ఎస్ ఆర్ చంద్ర మూర్తి, 3259 ఓట్లు;
4)బోక్య లాలు, 3136 ఓట్లు;
5) ఎం వెంకటరమణ, 3457 ఓట్లు తో గెలవడం జరిగింది.
Comments