రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "గడప గడపకు మన ప్రభుత్వం' ముఖ్య ఉద్దేశం పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు అర్హత ఉన్న వారు ఎవ్వరు కూడా సంక్షేమ పథకాలు కోల్పోకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్నిరాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సోములవారిపల్లే పంచాయతీ పరిధిలోని ఈశ్వర్ రెడ్డి నగర్ లో శుక్రవారం సాయంత్రం సర్పంచ్ మోపూరి ప్రశాంతి, ఎంపీపీ శేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గడపగడప కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన గడప గడపకు తిరిగి స్థానిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు లబ్ది తీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు జగనన్న ప్రభుత్వంలో ఏ ఒక్కరు నిరుస్తా పడకూడదని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నదే జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని ప్రజల కోసం ప్రజల మధ్యలో మమేకమై వారి బాగోగులు అడిగి తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఈ గడప గడప మన ప్రభుత్వ నిర్వహించాలని అందుచేతనే తాను ప్రతి ఇంటికి మీకు ఏ సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకోవాలని మీ గడప ముందుకు తాను వచ్చానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలకు తెలియజేశారు ప్రతి ఒక్కరిని లక్షాధికారిగా చూడాలన్నదే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం అని పేదలకు గృహ నిర్మాణ కోసం లక్ష 80 వేల రూపాయలు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తోందని ఏ ఒక్కరు ఇల్లు లేకుండా నిరుపేద అనేవారే లేకుండా చూడాలన్నదే తమ ప్రభుత్వం ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి వైసిపి రాష్ట్ర అదనపు కార్యదర్శి పో రెడ్డి నరసింహారెడ్డి. వైసిపి సీనియర్ నాయకులు కాకర్ల నాగశేషారెడ్డి. సోములవారిపల్లి ఉప సర్పంచ్ రామకృష్ణారెడ్డి మాజీ సర్పంచ్ గోపిరెడ్డి రమణయ్య ఎంపిటిసిలు నరసింహులు మార్కెటింగ్ చైర్మన్ యాలం శంకర్ యాదవ్.గోటురు వెంకటేష్. వైసీపీ పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి బాబు, బొందిలి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రసపుత్ర రజని. మున్సిపల్ వైసిపి, కౌన్సిలర్లు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి. షేక్ కమల్ భాష. యాల్లాల మహమ్మద్ గౌస్. గరిశపాటి లక్ష్మీదేవి.వైసిపి నాయకులు ఆచారి కాలనీ శివారెడ్డి, కంభం పాములేటి. రాయపు రెడ్డి .రాగా నరసింహులు. బండారు సూర్యనారాయణ. ఉమ్మడిశెట్టి సుబ్బయ్య . గజ్జల కళావతి. ప్రభాతమ్మ .సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పోలీస్ సిబ్బంది కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments